ఎన్టీఆర్ సింహాద్రి ఇండస్ట్రీ రికార్డును అందుకోకుండా చేసిన సినిమా ఇదే

0
1667

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్ ఏది అంటే అందరూ చెప్పే పేరు సింహాద్రి అని. 2003 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ఎన్టీఆర్ కెరీర్ లో ట్రూ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకుంది. ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే 26 కోట్ల షేర్ దాకా కలెక్ట్ చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గానే నిలవడమే కాకుండా సెకెండ్ బిగ్గెస్ట్ టాలీవుడ్ గ్రాసర్ గా నిలిచింది.

మొదటి ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర 32 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ ని దక్కించుకుంది. కాగా ఈ మధ్యనే సింహాద్రి నిర్మాతల్లో ఒకరైన దొరస్వామిరాజు సింహాద్రి ఎందుకని ఇండస్ట్రీ హిట్ అయిన ఇంద్ర రికార్డులను అందుకోలేకపోయింది అన్న ప్రశ్నకు జవాబు చెప్పాడు.

సింహాద్రి విడుదల అయిన సమయంలో టాలీవుడ్ లో మరో సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రీమ్ రన్ లో ఉంది. ఆ సినిమానే విక్టరీ వెంకటేష్ నటించిన వసంతం సినిమా. సింహాద్రి కన్నా డబుల్ థియేటర్లలో రిలీజ్ అయిన ఆ సినిమా సింహాద్రి మాసివ్ హిట్ కి భారీగానే కలెక్షన్లు గండికొట్టిందట. అందువల్లనే సింహాద్రి 30 కోట్ల మార్క్ ని అందుకోలేకపోయిందని లేకుంటే సింహాద్రి పేరు మీద ఆ రికార్డు కూడా ఉండేదని చెబుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here