స్పైడర్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా…ఫట్టా!!

0
7637

      గత ఏడాది బ్రహ్మోత్సవం లాంటి డిసాస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేస్తాడో అందరూ ఆశగా ఎదురుచూడగా సూపర్ స్టార్ కోలివుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్ లో తెలుగు తమిళ్ భాషల్లో ఏక కాలంలో స్పైడర్ లాంటి సెన్సేషనల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓవర్సీస్ లో ఈవినింగ్ 6 గంటల నుండే ఈస్ట్ కంట్రీస్ లో స్పెషల్ షోలతో మొదలైన స్పైడర్ సినిమాకి అక్కడ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందో తెలుసు కుందాం పదండీ…

హీరో విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్ మూవీస్ మనం ఇప్పటికే అనేకం చూసిన మురగదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్పైడర్ మాత్రం స్పెషల్ అనే చెప్పాలి అంటున్నారు. హాలివుడ్ రేంజ్ లో ఉన్న విజువల్స్…అండ్ టేకింగ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు.

కథ ఏంటో టీసర్ మరియు ట్రైలర్ లోనే చెప్పేశారని…సినిమాలో కూడా అదే విధంగా ఎలాంటి మార్పులు లేకుండా ఓ స్పై కి అనుకోకుండా ఓ జనాలని చంపడమే తన ధ్యేయం అనుకునే టెర్రరిస్ట్ కి మధ్య జరిగిన పోరే ఈ సినిమా అని అంటున్నారు.

పెర్ఫార్మెన్స్ పెరగా మహేష్ బాబు వన్ ఆఫ్ ది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపినా విలన్ రోల్ చేసిన ఎస్.జే.సూర్య తన సరికొత్త విలనిజం తో పీక్స్ లో పెర్ఫార్మెన్స్ తో అబ్బుర పరిచి కొన్ని చోట్ల మహేష్ ని డామినేట్ చేసే రేంజ్ లో యాక్టింగ్ తో దుమ్ము లేపాడని అంటున్నారు.

ఇక మిగిలిన నటీనటులు అందరూ తమ పనిని చక్కగా చేయగా సంగీతం తో పాటు బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ లో రెచ్చిపోయిన హారిజ్ జయరాజ్ హీరో ఎలివేషన్ సీన్స్ కి అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడని అవి వెండితెరపై చూస్తె వచ్చే కిక్కే వేరని అంటున్నారు.

సినిమా ప్లస్ పాయింట్స్ ఫాస్ట్ గా ఫస్టాఫ్…అదిరి పోయే ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ఎపిసోడ్స్ తో పాటు విలన్ ని హీరో ఇంటరాగేట్ చేసే సన్నివేశాలు సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు.

ఇక మైనస్ పాయింట్స్ సినిమా మొత్తం తమిళ్ ఫ్లేవర్ లో ఉండటం హీరో హీరోయిన్స్ తప్ప మిగిలిన వాళ్ళలో ఎక్కువ మంది  తమిళ్ యాక్టర్స్ అవ్వడం తో తెలుగు వాళ్ళు లేరా అని పిస్తుందని అంటున్నారు..ఇదొక్కటే సినిమాకి మైనస్ పాయింట్ అని అంటున్నారు.

మొత్తం మీద సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ తో కూడుకున్న మంచి సినిమా అని ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్ చెబుతుంది…ఇక రెగ్యులర్ ఆడియన్స్ టాక్ ఎలా ఉందో తమిళ్ ఫ్లేవర్ ని మన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో కొన్ని గంటల్లో తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here