అజ్ఞాతవాసి తీసేసి…స్పైడర్ వేస్తున్నారు…ఎక్కడో తెలుసా??

0
2500

టాలీవుడ్ చరిత్రలో అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ భారీ డిసాస్టర్స్ గా నిలిచిన సినిమాలు స్పైడర్ మరియు అజ్ఞాతవాసి…సూపర్ స్టార్ మహేష్ నటించిన స్పైడర్ దసరా బరిలో నిలిచి అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల బడిన విషయం తెలిసిందే…ఆ తర్వాత వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి స్పైడర్ ని కూడా మరిపిస్తూ అత్యంత భారీ ఫ్లాఫ్ గా టాలీవుడ్ చరిత్ర ను తిరగరాసింది.

అలాంటి సినిమా మొదటి వారం తరువాత చాలా ఏరియాలలో కొత్తసినిమాల కోసం తొలగించగా ఇప్పుడు ఆల్ మోస్ట్ కంప్లీట్ గా అన్ని థియేటర్స్ నుండి తొలగించిన ఈ సినిమా ను కొన్ని ఏరియాల్లో తిరిగి స్పైడర్ తో నడిపిస్తుండటం విశేషం అనే చెప్పాలి.

గుంటూరు మరియు మరికొన్ని ఏరియాలలో అజ్ఞాతవాసి ప్లేస్ లో స్పైడర్ తో పాటు మరికొన్ని పాత సినిమాలను తిరిగి ఆడిస్తున్నారు… సంక్రాంతి తర్వాత థియేటర్స్ ఎక్కువగా ఖాళీగా ఉండటం దీనికి కారణం అని అంటున్నారు….ఏది ఏమైనా ఒక ఫ్లాఫ్ సినిమాను మరో ఫ్లాఫ్ సినిమా రిప్లేస్ చేయడం అంటే విశేషం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here