ఇంత కష్టపడింది 5 కోట్ల కోసమా…టోటల్ ఇండస్ట్రీ షాక్

0
6340

        టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తెలుగు తో పాటు తమిళ్ మరియు మలయాళం లోనూ తెలుగు సినిమా మార్కెట్ ని తన మార్కెట్ కూడా ఎక్స్ పాండ్ చేయాలని ఎన్నో కళలు కన్నాడు…బిజినెస్ మాన్ ని అలా ఓకే భాషల్లో అన్ని చోట్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కుదరలేదు. కానీ ఈసారి ఏకంగా తెలుగు తమిళ్ భాషల్లో మురగదాస్ లాంటి టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాను తెలుగు తమిళ్ లో రిలీజ్ చేశాడు.

కాగా మహేష్ కోర్ ఫ్యాన్స్ అందరు మహేష్ ని పోకిరి లో ఉన్న రోల్ లాంటి సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా మురగదాస్ కథల్లో హీరోయిజం ఓ రేంజ్ లో ఉంటుంది కాబట్టి కచ్చితంగా స్పైడర్ భీభత్సం సృష్టిస్తుంది అని అంతా భావించారు.

కాగా వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా టీసర్ లో యాక్షన్ సీన్స్ అన్ని చూపించి పోస్టర్స్ లో గన్స్ తో మహేష్ ని సూపర్ స్టైలిష్ గా జేమ్స్ బాండ్ గా చూపించడం తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

కానీ ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయ్యిందో మొదటి పాట బూమ్ బూమ్ లోనే టీసర్ మరియు ట్రైలర్ లో చూసిన బెస్ట్ సీన్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి వెళ్ళడంతో భారీ ఆశలు పెట్టుకున్న వాళ్ళు నీరుగారి పోయారు.

ఇక సెకెండ్ ఆఫ్ లో హీరో విలన్ ని అంబులెన్స్ నుండి షూట్ చేసే సమయంలో తప్పితే ఎక్కడా హీరోయిజం ఎలివేట్ అయ్యే ఒక్క సీన్ కూడా లేకపోవడం తో తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఫీల్ అయ్యారని చెప్పొచ్చు.

కానీ మురగదాస్ సినిమా తమిళ్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని తీసిన విధంగా ఉందని విమర్శించేవారు లేకపోలేదు..ఎన్నో అంచనాలు పెట్టుకున్న స్పైడర్ ఇంత బడ్జెట్ రికవరీ అవ్వడం తమిళ్ నుండి కష్టం అనే విషయం అందరికీ తెలిసిందే.

అక్కడ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా తమిళనాడు లో రజినీ సినిమా తప్పితే 60 కోట్లు దాటిన సినిమా లేదు. అలాంటిది స్పైడర్ బడ్జెట్ మరియు బిజినెస్ లు 120 కోట్లకు పైమాటే…అంటే తెలుగు ఆడియన్స్ కి మహేష్ ని ఎలా చూడాలని ఉందో అలా చూయిస్తే ఇక్కడ స్టార్ కాంబినేషన్ దసరా సెలవులను వాడుకుని కుండపోతగా కలెక్షన్స్ వచ్చేవి.

కానీ తమిళ్ లో మహేష్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ కేవలం సింపుల్ క్యారెక్టర్ తో రావడం తో అక్కడ వారికి నచ్చినా ఇప్పటివరకు స్పైడర్ అక్కడ కలెక్ట్ చేసిన మొత్తం 5 కోట్లు కూడా లేదు….అదే తెలుగు డైరెక్టర్ తో ఏ యాక్షన్ ఎంటర్ టైనర్ తీసినా మహేష్ స్టామినాకి వీర లెవల్ లో కలెక్షన్స్ వచ్చేవి.

ప్రస్తుతం టోటల్ టాలీవుడ్ విశ్లేషకులు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి…ఇంత చేస్తే తమిళ్ బిజినెస్ 18.5 కోట్లు కాగా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 6 కోట్లకు అటూఇటూగా కలెక్షన్స్ వచ్చాయి…మురగదాస్ తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తే స్పైడర్ రేంజే వేరుగా ఉండేది అన్నది విశ్లేషకుల వాదన…మరి మీరు ఏమి అంటారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here