బ్రహ్మోత్సవం డిసాస్టర్…2 ఏళ్లకి అడ్డాల కొత్త మూవీ…హీరో ఎవరో తెలిస్తే షాక్!!

0
2062

2016 లో ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మూవీ బ్రహ్మోత్సవం అంచనాలను భారీ గా తప్పి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీ గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. అలాంటి సినిమా ఎలా ఒప్పుకున్నావ్ అంటూ మహేష్ పై అభిమానులు కూడా అలిగారు. అంతకుముందు మహేష్ కి సీతమవాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి మంచి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి సినిమా తీస్తాడని ఎవ్వరూ ఊహించలేదు.

కాగా ఆ సినిమా రిజల్ట్ తర్వాత మళ్ళీ రెండేళ్ళు బయటికి కనిపించకుండా ఉన్న శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ రెండేళ్ళకి ఇప్పుడు సరికొత్త సినిమా మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకు పోతున్న శర్వానంద్ తో సినిమా చేయబోతున్నాడు శ్రీకాంత్ అడ్డాల.

కాగా ఈ సినిమాలో శర్వానంద్ కి జోడిగా సాయిపల్లవి నటించే అవకాశం ఉందని అంటుండగా మరో కీలక రోల్ లో సునీల్ నటించబోతున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. బ్రహ్మోత్సవం దెబ్బకి రెండేళ్ళు ఖాళీగా ఉన్న శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ ఎలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమా తో కంబ్యాక్ చేస్తాడు అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి ని రేపుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here