ఇదీ సూపర్ స్టార్ సినిమా రేంజ్ కాదు…టోటల్ టాలీవుడ్ షాక్

0
3704

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో పక్క రాష్ట్రం కర్ణాటక లో మరియు ఓవర్సీస్ లో కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ఉంది. సరైన సినిమా పడిన ప్రతీ సారి మహేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మంచి సినిమా పడని ప్రతీ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలు కూడా వచ్చాయి.

శ్రీమంతుడు లాంటి ఎబో యావరేజ్ సినిమా తో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన మహేష్ తర్వాత భారీ అంచనాల నడుమ చేసిన బ్రహ్మోత్సవం తీవ్ర నిరాశని మిగిలించాగా ఇప్పుడు ఆ సినిమా కన్నా భారీ ఎత్తున వచ్చిన స్పైడర్ మరింత నిరాశని మిగిలించింది.

మొదటి ఆటకే యునానిమస్ నెగటివ్ టాక్ తెచ్చుకున్న స్పైడర్ ఏ దశలోనూ కోలుకునేలా కనిపించకపోయినా అన్ని చోట్లా కలిపి 64 కోట్ల మార్క్ అందుకోవడం చూసి మహేష్ స్టామినా ఇది కాదని…ఓ మాస్ మూవీ పడితే పోకిరి లెవల్ లో ఇండస్ట్రీ రికార్డులను చెడుగుడు ఆడేసుకు౦టాడని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న భరత్ అనే నేను ఈ కోవలోకి చేరుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here