ఇండస్ట్రీ ని ఊపు ఊపేస్తున్న న్యూస్…అది హిట్ మరి ఇది??

0
8507

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా రంగస్థలం1985, భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఊరమాస్ రోల్ లో అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. కాగా ఈ సినిమా కథ పూర్తిగా డైరెక్టర్ సుకుమార్ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల సమాహారం అంటూ ఇండస్ట్రీలో వార్తలు శిఖారు చేస్తున్నాయి..దీనికి కారణం తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను ఇందులో పొందుపరచాడట సుకుమార్.

దాంతో ఈ సినిమా సుకుమార్ బయోపిక్ గా తెరకెక్కుతు౦దని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు…ఇదివరకు సుకుమార్ తన తండ్రి కోసం నాన్నకుప్రేమతో చేయగా ఇప్పుడు తనకోసం రంగస్థలం1985 చేస్తున్నాడు..నాన్నకుప్రేమతో సూపర్ హిట్ అయ్యింది…మరి రంగస్థలం1985 ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన సినిమా ఫస్ట్ లుక్ కి అదిరిపోయే లెవల్ లో రెస్పాన్స్ రాగా సోషల్ మీడియా లో పెను సంచలన రికార్డులను ఈ సినిమా ఫస్ట్ లుక్ బ్రేక్ చేసింది…ఇక టీసర్ రిలీజ్ అయ్యాక రచ్చ ఎ రేంజ్ లో ఉండబోతుందో అంటూ అందరూ ఎంతో ఆశగా టీసర్ కోసం ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here