సునీల్ 2 కంట్రీస్ మూవీ టాక్ ఎలా ఉంది?? హిట్టా—ఫట్టా

0
1290

  కమెడియన్ నుండి హీరోగా మారాక సునీల్ పరిస్థితి సినిమా సినిమాకి ప్రభావం పూర్తిగా కోల్పోయే పరిస్థితి కి వచ్చింది… మర్యాదరామన్న మరియు పూలరంగడు ఈ రెండు సినిమాలు మాత్రమే హీరో అయ్యాక సునీల్ సాధించిన విజయాలు…తర్వాత కొన్ని సినిమాల వరకు ఓపెనింగ్స్ అయినా వచ్చాయి కానీ ఇప్పుడు జనాలు సినిమాలను పట్టించుకోవడం కూడా మానేశారు. ఇలాంటి సమయంలో సునీల్ హీరోగా చేసిన మరో సినిమా 2 కంట్రీస్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

సినిమా టాక్ కూడా ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే అని చెప్పాలి….సునీల్ రీసెంట్ గా చేసిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా కొంచం చప్పగా కొంచం కామెడీగా ఉందని అంటున్నారు…ఓవర్సీస్ లో సినిమా ఎన్ని టికెట్స్ తెగాయో వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మిక్సుడ్ టు నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగాను ఇసుమంత కూడా ప్రభావం చూపలేకపోయింది. షాకింగ్ గా 12 టు 15% మాత్రమే ఓపెనింగ్స్ ని తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర న్యూ ఇయర్ వీకెండ్ ని ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి. సినిమా బడ్జెట్, బిజినెస్ కలెక్షన్స్ వివరాలు మరో ఆర్టికల్ లో డీటైల్డ్ గా తెలియజేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here