సూర్య గ్యాంగ్ 8 రోజుల టోటల్ కలెక్షన్స్…క్లీన్ హిట్ కి ఇంకా ఎంత కావాలి అంటే?

0
698

  సంక్రాంతి రేసులో తెలుగు సినిమాలతో పోటి పడ్డ తమిళ్ డబ్బింగ్ మూవీ గ్యాంగ్ ఓపెన్ అవ్వడం చాలా స్లో గా ఓపెన్ అయిన సంక్రాంతి వీక్ మొత్తం మీద మంచి వసూళ్లు సాధించింది అని చెప్పొచ్చు. జై సింహా సినిమా తో పాటు జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కేవలం 80 లక్షల షేర్ తోనే మొదలు పెట్టినా టోటల్ వీక్ ముగిసిన తర్వాత మంచి వసూళ్లు సాధించింది.

టోటల్ గా మొదటి వారంలో నైజాంలో 1.6 కోట్లు, సీడెడ్ లో ఒక కోటి, టోటల్ ఆంధ్రాలో 3.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా మొదటి వారం మొత్తం మీద సినిమా 5.9 కోట్ల షేర్ ని సాధించింది. ఇక 8 వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ సినిమా బాగానే హోల్డ్ చేసి 50 లక్షల మేర షేర్ ని సాధించింది.

దాంతో సినిమా మొత్తం మీద 8 రోజుల కలెక్షన్స్ ఇప్పుడు 6.4 కోట్ల షేర్ ని అందుకుందని సమాచారం. ఇక సినిమా బిజినెస్ అఫీషియల్ గా 8 కోట్ల రేంజ్ లో జరిగిందని యు వి క్రియేషన్స్ వారు తెలియజేయడంతో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి మరో 2 కోట్లు కలెక్ట్ చేస్తే సరిపోతుంది. సెకెండ్ వీక్ లో సినిమా ఆ మార్క్ అందుకోవడం ఖాయం అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here