సూర్య “గ్యాంగ్” టాక్ ఏంటి…మూవీ ఎలా ఉంది??

0
2753

    కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఒకసారి రిలీజ్ అయ్యింది…సినిమా సూర్య కెరీర్ కి చాలా కీలకమైన సినిమా అని చెప్పొచ్చు…సింగం సిరీస్ ని పక్కకు పెడితే 24 తో సూపర్బ్ అనిపించుకున్నా నికార్సయిన మాస్ హిట్ సూర్యకి పడలేదు…పక్కా మాస్ కంటెంట్ తో సూర్య గ్యాంగ్ తెరకెక్కింది అని చెప్పొచ్చు. సినిమా టాక్ ఎలా ఉందంటే….

బాలీవుడ్ మూవీ స్పెషల్ 26 సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో నడిచే సినిమా…బాలీవుడ్ మూవీ లో క్లాస్ గా ఉండే కంటెంట్ తో తెరకెక్కిన సినిమాను ఇక్కడ ఆడియన్స్ కి నచ్చే విధంగా చాలా మార్పులు చేర్పులు చేసి మెయిన్ కంటెంట్ ని మాత్రం అలానే పెట్టారు.

నకిలీ ఇంకం టాక్స్ అండ్ సి ఐ డి ఆఫీసర్స్ గా డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే గ్యాంగ్ కథే సినిమా…సినిమా ఫస్టాఫ్ ఫుల్ రేసీ గా సాగుతుందని…మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ ముగిస్తుందని…తర్వాత సెకెండ్ ఆఫ్ మళ్ళీ జోరు అందుకోగా చివర్లో భారీ ట్విస్ట్ తో సినిమా ముగిస్తుందని అంటున్నారు.

మొత్తం మీద సినిమా ఆల్ ఇన్ ఆల్ పక్కా కమర్షియల్ మూవీ అని అంటున్నారు…ఫైట్స్ వగైరా పెద్దగా లేకున్నా మిగిలిన అన్ని అంశాల్లో సినిమా ప్రేక్షకులను అలరించే కంటెంట్ తో తెరకెక్కిన సినిమా అని అంటున్నారు…సంక్రాంతి సమయంలో రిలీజ్ అవ్వడంతో సినిమాకి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఇక్కడ కూడా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here