సైరా నరసింహా రెడ్డి టీసర్ రివ్యూ…200 కోట్ల బొమ్మ బాస్

2
6018

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ టీసర్ ఎట్టకేలకు వచ్చేసింది. చిరు పుట్టినరోజు కన్నా ఒకరోజు ముందుగా రిలీజ్ అయిన టీసర్ చూసి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక టీసర్ ఎలా ఉందంటే…1800 కాలంలో బ్రిటిష్ వారిపై పోరాడిన మొట్టమొదటి ఇండియన్ గా పేరు తెచ్చుకున్న ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి టీసర్ లోనూ అదే కథని చూపించారు.

టీసర్ లో మెగాస్టార్ న్యూ గెటప్ కి ఒకే అనిపించే మార్కులు పడ్డా మిగిలిన సీన్స్ కి మాత్రం అంచనాలు మించే మార్కులు పడ్డాయి. ముఖ్యంగా చిరు కోట పై కనిపించిన విధానం…చెట్ల చాటు నుండి గుర్రం పై బయటికి వచ్చిన విధానం…

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

అలాగే చివర్లో గుర్రం పై చిరు స్వారీ ఓ రేంజ్ లో హైలెట్ అయ్యాయి. ఆ సీన్స్ ని ఎలివేట్ చేస్తూ బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్ కి తీసుకెళ్లింది. మొత్తం మీద టీసర్ అంచనాలు అమాంతం పెంచగా సైరా నరసింహా రెడ్డి మినిమమ్ 200 కోట్ల బొమ్మ అంటూ అందరూ చెబుతున్నారు. మీరు టీసర్ చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

2 COMMENTS

  1. జై చిరంజీవ… చిరంజీవ మజాకా…..సినిమా ఇండస్ట్రీలో,సినిమా ఇండస్ట్రీకి ఏకైక…మొగుడు…చిరంజీవిగారు..సినిమా ఇండస్ట్రీకి….ఎప్పటికి.మరెప్పటికి.మెగా ఫ్యామిలీదే….అన్ని జన్మలు ఎత్తిన…..చిరంజీవి గారిని….. కొట్టే మగాడు లేడు రాడు రాబోడు……. జై చిరంజీవ జై జై చిరంజీవ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here