తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం బిగ్గెస్ట్ డిసాస్టర్ సినిమాలు ఇవే

4
203

టాలీవుడ్ లో పెరిగిన మార్కెట్ దృశ్యా పెద్ద సినిమాలు కొట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ తీరా విడుదల అయ్యాక అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలపడ్డ సినిమాలో కోకొల్లలు. అలా౦టి సినిమాలు గత 5 ఏళ్లలో మరీ ఎక్కువ అవ్వడం విషాదకరమే అయినా వాటి రిజల్ట్స్ ని ఎవ్వరు మార్చలేరు.

టాలీవుడ్ లో ఇప్పటివరకు విడుదల అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ గా నిలిచిన టాప్ 12 సినిమాలు ఎవో చూద్దాం పదండి. కొన్ని సినిమాలు ఈ లిస్టులో చేర్చాల్సి ఉంది, వాటి థియేట్రికల్ రన్ పూర్తి అవ్వగానే అప్ డేట్ చేస్తాం.

12. ఎన్టీఆర్ “రభస”(2014):-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో భారీగా తెరకెక్కిన రభస చిత్రం విడుదలకి ముందు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బొక్కబోర్ల పడింది.

సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 42 కోట్లు

అమ్మిన రేటు(అంచనా):- 46 కోట్లు

వచ్చిన మొత్తం:- 28 కోట్లు

టోటల్ లాస్:- 18 కోట్లు

****************************************************

11. మహేష్ బాబు”ఖలేజా”(2010):-

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఖలేజా మహేష్ ని కొత్త యాంగిల్ లో చూపించినప్పటికీ సినిమాలు సరుకు ప్రేక్షకులకు ఎక్కకపోవడంతో అట్టర్ ఫ్లాఫ్ గా మిగిలింది.

సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 42 కోట్లు

అమ్మిన రేటు(అంచనా):- 40 కోట్లు

వచ్చిన మొత్తం:- 18.40 కోట్లు

టోటల్ లాస్:- 21.60 కోట్లు

***************************************************

10. మహేష్ బాబు”ఆగడు”(2014):-

దూకుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత మహేష్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన ఆగడు సినిమా మరోసారి దూకుడునే చూపించి మధ్యలో గబ్బర్ సింగ్ స్టైల్ ని కాపీ కొట్టడంతో ప్రేక్షకులకు రుచించలేదు. దాంతో రిజల్ట్ తేడా కొట్టేసింది.

సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 48 కోట్లు

అమ్మిన రేటు(అంచనా):-  56 కోట్లు

వచ్చిన మొత్తం:- 34 కోట్లు

టోటల్ లాస్:- 22 కోట్లు

**************************************************

9. బాలకృష్ణ “పరమ వీర చక్ర”(2011):-

10 ఏళ్ల తరువాత సింహా లాంటి భారీ విజయం సాధించిన బాలయ్య దాసరి నారాయణరావు గారి 150 వ సినిమాగా తెరకెక్కించిన పరమవీర చక్రలో నటించారు. సినిమా సంక్రాంతికి భారీ ఎత్తున విడుదల అయినా సినిమాలో సరుకు లేకపోవడంతో బిగ్గెస్ట్ డిసాస్టర్ గా మిగిలింది.

సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 25 కోట్లు

అమ్మిన రేటు(అంచనా):- 26 కోట్లు

వచ్చిన మొత్తం:- 3.80 కోట్లు

టోటల్ లాస్:- 22.20 కోట్లు

***************************************************

8. ఎన్టీఆర్ “శక్తి”(2011):-

మగధీర చూసిన దర్శకుడు మెహర్ రమేష్ అలాంటి సినిమాను తీయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి అల్లుఅర్జున్ తో చేయాలని ట్రై చేసినా కుదరక ఎలాగోలా ఎన్టీఆర్ ని మభ్యపెట్టి చేసిన చిత్రం శక్తి. ఫస్టాఫ్ ఎంతోకొంత బాగుంది అనిపించినా సెకెండాఫ్ సినిమాకు పెద్ద మైనస్ గా మారి అట్టర్ ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. ఎన్టీఆర్ ఇప్పటికీ ఈ సినిమా ఎందుకు చేశానా అని భాదపడుతూనే ఉన్నాడు.

సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 45 కోట్లు

అమ్మిన రేటు(అంచనా):- 42 కోట్లు

వచ్చిన మొత్తం:- 19.50 కోట్లు

టోటల్ లాస్:- 22.50 కోట్లు

**********************************************

7. రామ్ చరణ్ “తూఫాన్”(2013):-

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో చేసిన అతిపెద్ద తప్పుల్లో అలనాటి క్లాసిక్ జంజీర్ ని రీమేక్ చేయడం ఒకటి. హిందీతో పాటు తెలుగులో కూడా రూపొందించిన తూఫాన్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి డిసాస్టర్ అమ్మమొగుడుగా మిగిలిపోయింది.

సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 42 కోట్లు

అమ్మిన రేటు(అంచనా):- 36.20 కోట్లు

వచ్చిన మొత్తం:- 11.20 కోట్లు

టోటల్ లాస్:- 25 కోట్లు

*************************************************

6. రామ్ చరణ్ “ఆరెంజ్”(2010):-

మగధీర లాంటి ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత ఏ సినిమా చేసినా దానిపై అంచనాలు ఓ రేంజ్ లో ఉండటం సహజం. అలాంటి సమయంలో మాస్ స్టోరీ వద్దనుకున్న రామ్ చరణ్ బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన ఆరెంజ్ ఒక కొత్త అనుభూతిని మిగిలించిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం “ఓ రేంజ్” లో ఫ్లాఫ్ అయింది.

సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 46 కోట్లు

అమ్మిన రేటు(అంచనా):- 46.50 కోట్లు

వచ్చిన మొత్తం:- 20.10 కోట్లు

టోటల్ లాస్:- 26.40 కోట్లు

********************************************

5. పవన్ కళ్యాణ్ “కొమురం పులి”(2010):-

ఖుషి తరువాత ఆ రేంజ్ హిట్ కోసం మొఖం వాచి ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి ఇచ్చిన దర్శకుడు ఎస్.జే.సూర్య తో చేతులు కలిపి చేసిన చిత్రం కొమురం పులి. భారీ అంచనాల నడుమ…భారీ అడ్డంకుల నడుమ విడుదల అయిన కొమురం పులి పవర్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ సినిమాగా మిగలడమే కాకుండా టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా మారింది.

సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 45 కోట్లు

అమ్మిన రేటు(అంచనా):- 45 కోట్లు

వచ్చిన మొత్తం:-  18.30 కోట్లు

టోటల్ లాస్:- 26.70 కోట్లు

***********************************************

4. అక్కినేని అఖిల్ “అఖిల్”(2015):-

అక్కినేని లెగసీలో 40 కోట్లకు పైగా కలెక్ట్ చేయగల సత్తా ఉన్న హీరో అఖిల్ ఒక్కడే అని భారీ ప్రమోషన్ మధ్యన వినాయక్ దర్శకత్వంలో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం అఖిల్. భారీ అంచనాల నడుమ దీపావళికి విడుదల అయిన అఖిల్ టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా నిలిచింది.

సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 42.50 కోట్లు

అమ్మిన రేటు(అంచనా):- 48.50 కోట్లు

వచ్చిన మొత్తం:- 20.20 కోట్లు

టోటల్ లాస్:- 28.30 కోట్లు

************************************************

3.మహేష్ బాబు “బ్రహ్మోత్సవం”(2016):-

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ మూవీ బ్రహ్మోత్సవం ఇండస్ట్రీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ తెలుగు వర్షన్ కి 75.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ రన్ లో 36.80 కోట్ల వరకు బిజినెస్ చేసింది. దాంతో టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలిచింది.తమిళ్ డబ్బింగ్ వర్షన్ కి కూడా 12 కోట్ల బిజినెస్ చేసింది కానీ ఇంకా రిలీజ్ కాలేదు. అక్కడ ఎలా కలెక్ట్ చేస్తుంది అనేదానికిపై ర్యాంక్ ఎంతో తెలుస్తుంది.

సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 45 కోట్లు

అమ్మిన రేటు(అంచనా):- తెలుగు 75.60 కోట్లు, తమిళ్ 12.20 కోట్లు

వచ్చిన మొత్తం:- 36.80 కోట్లు,

టోటల్ లాస్:- 38.80 కోట్లు

************************************************

2.మహేష్ బాబు “1 నేనొక్కడినే”(2014):-

సూపర్ స్టార్ మహేష్ బాబుతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేయాలి అని తపించిన సుకుమార్ అలాంటి ఆలోచనలతో చేసిన చిత్రం 1 నేనొక్కడినే. నటన పరంగా మహేష్ పీక్స్ లో నటించినప్పటికి సినిమాలో ప్రేక్షకులను అలరించే అంశాలు ఒక్కటి కూడా లేకపోవడం సినిమా నిడివి సుమారు 3 గంటలవరకు ఉండటంతో టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలిచింది ఈ సినిమా.

సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 55 కోట్లు

అమ్మిన రేటు(అంచనా):- 72 కోట్లు

వచ్చిన మొత్తం:- 29.30 కోట్లు

టోటల్ లాస్:- 42.70 కోట్లు

************************************************

1.పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్”(2016):-

పవర్ స్టార్ పవన కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ కి 83.40 కోట్ల బిజినెస్ అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 99 కోట్ల బిజినెస్ చేసింది. టోటల్ రన్ లో 53 కోట్ల షేర్ వసూల్ చేసిన సర్దార్ టాలీవుడ్ బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది.

సినిమాకు పెట్టిన బడ్జెట్(అంచనా):- 32 కోట్లు

అమ్మిన రేటు(అంచనా):- తెలుగు 83.40 కోట్లు, హిందీ 16.20 కోట్లు

వచ్చిన మొత్తం:- 52.60 కోట్లు

టోటల్ లాస్:- 47 కోట్లు

************************************************

ఇవి టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం టాప్ 10 బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్….ఇవి కాకుండా

ప్రభాస్ రెబల్———-17.70 కోట్లు

పవన్ కళ్యాణ్ పంజా——17.68 కోట్లు

రామ్ చరణ్ బ్రూస్ లీ ——-17.61 కోట్లు

ఊ కొడతార ఉలిక్కిపడతార—–17 కోట్లు

ఊసరవెల్లి ———16.50 కోట్లు లాస్ తెచ్చుకున్నాయి

Tollywood alltime top disaster movies

the above article shows how many biggest flops in tollywood has produced…top 10 biggest flops list.

4 COMMENTS

  1. Hello Tollywood2Bollywood garu Oosaravelli movie Business – 31.60 Crs & Collections – 28.48 Crs. Movie Result – Average 2 Above Average. konchem chusi articles rayandi please …….

  2. Hello Tollywood2Bollywood garu Oosaravelli movie Business – 31.60 Crs & Collections – 28.48 Crs. Movie Result – Average 2 Above Average. konchem chusi articles rayandi please …….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here