2.5 కోట్లు పెట్టి కొంటే 4 కోట్ల లాభం…సినిమా సూపర్ హిట్

0
3717

ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు తెలుగు లో తక్కువగానే ఆడాయి అని చెప్పాలి… కొన్ని సినిమాలు బాగున్న మన ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లు లేకపోవడంతో ఇక్కడ విజయాలను అందుకోలేక పోయాయి. ఇక రీసెంట్ గా ఇలయధలపతి విజయ్ నటించిన మెర్సల్ తెలుగు లో అదిరింది పేరుతొ డబ్ అయ్యి మొదటి వీకెండ్ లోనే 4 కోట్లకు పైగా షేర్ ని అందుకున్నా టోటల్ రన్ లో 6 కోట్ల లోపే ఆగిపోయి క్లీన్ హిట్ గా నిలిచింది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కార్తీ నటించిన ఖాకీ మూవీ మాత్రం సైలెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఇక్కడ కూడా వరుస హిట్లతో దూసుకుపోయిన కార్తీకి తర్వాత ఫ్లాఫ్స్ వల్ల మార్కెట్ కోల్పోయినా తిరిగి ఊపిరి ఇక్కడ మార్కెట్ సొంతం అయింది.

ఆ తర్వాత చేసిన కాష్మోరా యావరేజ్ గా నిలిచినా మణిరత్నం డైరెక్షన్ లో చేసిన చెలియా డిసాస్టర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది…..దాంతో రీసెంట్ గా రిలీజ్ అయిన ఖాకీ మాత్రం 2.5 కోట్ల బిజినెస్ చేసి టోటల్ రన్ లో 6.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ గా నిలిచి సోలో హీరోగా కార్తీకి తిరిగి సూపర్ ఫామ్ లో చేరేలా చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here