జనతాగ్యారేజ్ కన్నా టెంపర్ గొప్ప…మీరేమంటారు?

0
912

నంది అవార్డుల్లో ఇప్పుడు మరో ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది…ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయాన్ని లైట్ తీసుకున్న ఎన్టీఆర్ సినిమా నిర్మాత మాత్రం ఈ విషయాన్ని గట్టిగానే ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ సినిమా ఎంత బాగున్నా ఆ సినిమా ను పక్కకు పెట్టేశారని అంటున్నాడు… ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా నటుడిగా ఎన్టీఆర్ కి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే… కానీ ఆ సినిమా నిర్మాత మెగా ఫ్యామిలీ…..

ప్రొడ్యూసర్ అంటూ అవార్డ్ ఇవ్వకుండా పక్కకు పెట్టేశారని నిర్మాత బండ్ల గణేష్ చెబుతున్నాడు. ఎన్టీఆర్ నటించిన సినిమా లలో టెంపర్-జనతాగ్యారేజ్ సినిమాలను చూసుకుంటే నటుడిగా ఎ సినిమా లో ఎన్టీఆర్ ఎక్కువ నటన కనబరిచాడో అందరికీ తెలిసిన విషయమే..

కానీ టెంపర్ కి ఇవ్వకుండా జనతాగ్యారేజ్ కి ఇవ్వడంలో ఉద్దేశ్యం ఏంటి అంటూ బండ్ల గణేష్ చెబుతున్నాడు. మొత్తం మీద 2014 తో పాటు ఇప్పుడు 2015 ఇయర్ కి అనౌన్స్ చేసిన అవార్డుల విషయంలో రచ్చ జరుగుతుంది…ఎన్టీఆర్ నటన ముఖ్యం కానీ అవార్డులు ముఖ్యం కాదు అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయాన్ని వదిలేయడం ఇక్కడ విశేషం అని చెప్పాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here