డే 3 కలెక్షన్స్… మళ్ళీ కొట్టాడు!!

0
1180

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల అరవింద సమేత జోరు కొనసాగుతుంది…రెండు రోజుల్లో టోటల్ గా 47.6 కోట్ల షేర్ తో 76 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ తో దుమ్ము లేపిన ఈ సినిమా మూడో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది…

మొదటి రెండు షోల కి సినిమా రెండో రోజు తో పోల్చితే కొద్దిగా డ్రాప్ అయినా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి మాత్రం బాగా పుంజుకుంది…రెండు తెలుగు రాష్ట్రాలలో ఈవినింగ్ అండ్ నైట్ షోల టోటల్ ఆక్యుపెన్సీ ని చూస్తే ఆల్ మోస్ట్ 60% ని టచ్ చేసింది.

దాంతో మూడో రోజు సినిమా కలెక్షన్స్ మరోసారి 8 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు…నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఇంకా జోరుగా ఉన్నాయి కాబట్టి ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి సినిమా 10 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయం అంటున్నారు…మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here