తొలిప్రేమ డే 3 కలెక్షన్స్…వర్కింగ్ డేలో భీభత్సం!!

0
1455

  వరుణ్ తేజ్ రాశిఖన్నా ల కాంబినేషన్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తొలిప్రేమ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ తో మంచి ఓపెనింగ్స్ తో దుమ్ము లేపే కలెక్షన్స్ తో తొలి రెండు రోజుల్లోనే 9.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించి దుమ్ము లేపింది. సినిమా రెగ్యులర్ ఫ్రై డే న రిలీజ్ కాకుండా శనివారం రిలీజ్ అవ్వడంతో వీకెండ్ 3 డేస్ అడ్వాంటేజ్ ని సొంతం చేసుకోలేకపోయింది.

దాంతో రెండు రోజుల వీకెండ్ లోనే కుమ్మేసిన సినిమా వర్కింగ్ డే లో స్లో అవుతుంది అని అంతా భావించినా అది జరగలేదు. సినిమా వర్కింగ్ డే లో కూడా అన్ని ఏరియాలో సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ పర్వాలేదు అనిపించగా….

తిరిగి ఈవినింగ్ షోల ఆక్యుపెన్సీ దుమ్ము లేపే రేంజ్ లో గ్రోత్ ని సాధించింది. మొత్తం మీద మూడో రోజు మండే అయినా కానీ సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 2 కోట్ల మేర కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి అఫీషియల్ గా సినిమా ఎంతవరకు వసూల్ చేస్తుందో కొన్ని గంటల్లో తెలియనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here