3 డేస్ లో 20 కోట్లు…తొలిప్రేమ వీరలెవల్ కలెక్షన్స్ ఇవి!!

0
768

  వరుణ్ తేజ్ రాశిఖన్నా ల కాంబినేషన్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తొలిప్రేమ రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మొదటి రెండు రోజుల్లోనే దుమ్ము లేపే వసూళ్ళతో సంచలనం సృష్టించింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు మండే టెస్ట్ ని ఎదుర్కొన్న కానీ మంచి కలెక్షన్స్ ని ఆ టెస్ట్ ని పాస్ అయ్యి లాంగ్ రన్ ఉందని కన్ఫాం చేసుకుంది.

కాగా రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.2 కోట్లు…టోటల్ వరల్డ్ వైడ్ గా 9.2 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 2.1 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 2.24 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. దాంతో…

సినిమా మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో 8.3 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 11.44 కోట్ల షేర్ ని 20.6 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ని మూడు రోజుల్లో అందుకుని సాలిడ్ స్టార్ట్ ని సొంతం చేసుకుంది. 24 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమాకి ఈ రోజు రేపు ఫుల్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మరి సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో మరో ఆర్టికల్ లో తెలియజేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here