తెలుగు సినిమా చరిత్రలో రీమేక్ లు చేయని స్టార్ హీరోలు ఎవరో తెలుసా????

0
5438

  టాలీవుడ్ హీరోల్లో దాదాపు గా ప్రతీ ఒక్కరు ఎదో ఒక సమయంలో వేరే భాషల్లో హిట్లుగా నిలిచిన సినిమా లను తెలుగు లో రీమేక్ చేశారు. ఇందు లో కొందరు మాత్రమే సక్సెస్ అయితే చాలా మంది ఫ్లాఫ్ అయ్యారు. ఒకప్పుడు సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ వరుస గా రీమేక్ సినిమా లు చేస్తూ సేఫ్ జోన్ వరుస గా సూపర్ హిట్ల ను అందు కునే వాడు.

ఇప్పటి యంగ్ జనరేషన్ టాప్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఖుషి-గబ్బర్ సింగ్ తో రీమేక్ తో సూపర్ హిట్లు అందుకోగా ఎన్టీఆర్ నరసింహుడుతో, ప్రభాస్ యోగితో, రామ్ చరణ్ తూఫాన్ తో రీమేక్ ఫ్లాఫ్స్ ని అందుకున్నారు. కాని ఓ ఇద్దరు హీరోలు మాత్రం ఈ రీమేక్ సినిమాలకు చాలాదూరంగా ఉంటున్నారు.

ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. మహేష్ రీమేక్ సినిమాలను డైరెక్ట్ గానే చేయను అని అనౌన్స్ చేయగా అల్లుఅర్జున్ ఇప్పటివరకు ఎందుకనో రీమేక్ పై ఎందుకనో తన అభిప్రాయాన్ని చెప్పలేదు. దాంతో ఈ యంగ్ జనరేషన్ లో ఈ ఇద్దరు మాత్రమే రీమేక్ లకు దూరం ఉంటూ తమ మార్క్ ని నిలుపుకుంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here