మొదటి 3 రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే

0
5746

     తెలుగు సినిమా మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగిన వేల తెలుగు సినిమా కలెక్షన్స్ మొదటి వీకెండ్ లో ఆల్ టైం రికార్డ్ లెవల్ లో వస్తున్న విషయం తెలిసిందే…కాగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో బాహుబలి సినిమా మూడు రోజుల్లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది… మిగిలిన సినిమాలలో కూడా కొన్ని టాక్ కి అతీతంగా మొదటి మూడు రోజుల్లోనే భీభత్సం సృష్టించాయి…ఒకసారి మొదటి 3 రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఏవో తెలుసుకుందాం….

టాప్ 1:- బాహుబలి 2
టాలీవుడ్ ఆల్ టైం ఎపిక్ వండర్ బాహుబలి పార్ట్ 2 ప్రపంచవ్యాప్తంగా సంచలన కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించగా ఒక్క తెలుగు వర్షన్ కలెక్షన్స్ నే తీసుకున్నా మొదటి మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఏకంగా 138 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

టాప్ 2:- బాహుబలి 1
మూడేళ్ళ క్రితం వచ్చిన బిగ్గెస్ట్ ఎపిక్ వండర్ బాహుబలి రికార్డులు ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం….సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అలాంటిది అని చెప్పొచ్చు….మొదటి మూడు రోజుల్లో సినిమా తెలుగు వర్షన్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా ఏకంగా 73.4 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది…

టాప్ 3:- ఖైదీనంబర్ 150
గత ఏడాది సంక్రాంతి కి 10 ఏళ్ల తర్వాత తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనంబర్ 150 బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ సంచలన కలెక్షన్స్ తో మొదటి మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 50.2 కోట్ల షేర్ ని అందుకుని నాన్ బాహుబలి రికార్డ్ హోల్డర్ గా సంచలనం సృష్టించింది.

టాప్ 4:- జైలవకుశ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా వీకెండ్ కి ముందు రిలీజ్ అయ్యి మొదటి మూడు రోజుల్లో దుమ్ము లేపే వసూళ్లు సాధించింది…మొత్తం మీద మూడు రోజుల్లో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 45.84 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

టాప్ 5:- అజ్ఞాతవాసి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాధించిన ఆల్ టైం నాన్ బాహుబలి చారిత్రిక కలెక్షన్స్ హెల్ప్ తో మొదటి మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 45.7 కోట్ల షేర్ ని అందుకుంది….

ఇవీ ప్రస్తుతానికి మొదటి మూడు రోజులకు గాను టాలీవుడ్ లో టాప్ 5 ప్లేసులలో నిలిచిన సినిమాలు…ఈ ఇయర్ లో రంగస్థలం, నా పేరు సూర్య  నా ఇల్లు ఇండియా, భరత్ అనే నేను, ఎన్టీఆర్28 మిగిలిన పెద్ద సినిమాలు ఉండగా ఈ లిస్టులో చేరే సినిమాలు ఏవి అవుతాయి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here