80 దేశాలు…1300 థియేటర్స్…ఏం రికార్డ్ సామి ఇది

0
604

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ ధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ ఎత్తున మరో రెండు రోజుల్లో రాబోతుంది. కాగా సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు లో కూడా భారీ గా రిలీజ్ కాబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ ఓవర్సీస్ లో మాత్రం కోలీవుడ్ సినిమాల రికార్డులనే కాదు ఇండియన్ సినిమా రికార్డులు కూడా బ్రేక్ చేస్తుంది.

సినిమా టోటల్ ఓవర్సీస్ లో సుమారు 80 దేశాల్లో 1300 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందట. ఇది కోలీవుడ్ మూవీస్ లో నే కాదు ఇండియన్ సినిమాల పరంగా కూడా బిగ్గెస్ట్ రిలీజ్ ని సొంతం చేసుకోనుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 7.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

తమిళనాడు లో కూడా సినిమా 80 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద ఈ దీపావళి కి సోలో గా ఇటు తమిళ్ లో తెలుగు లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ సెంసేషన్ ని క్రియేట్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here