27 కోట్ల టార్గెట్…10 డేస్ కలెక్షన్స్ దిమ్మతిరిగే షాక్!!

0
951

  మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీసెంట్ మూవీ రాజా ది గ్రేట్ సూపర్ హిట్ తర్వాత మాస్ మహారాజ్ చేసిన సినిమా టచ్ చేసి చూడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిశ్రమ స్పందనని దక్కించుకుంది. తొలిరోజు వసూళ్ళ పరంగా పర్వాలేదు అనిపించుకునేలా 4.17 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన ఈ సినిమా వీకెండ్ వరకు టోటల్ గా 8.2 కోట్ల షేర్ ని అందుకుంది.

కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో పూర్తిగా డౌన్ అయిన ఈ సినిమా ఏమాత్రం జోరు చూపలేదు. టోటల్ వర్కింగ్ డేస్ లో కేవలం 1.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఈ సినిమా. దాంతో మొదటి వారం మొత్తం మీద సినిమా 9.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.

ఇక సినిమా రెండో వీకెండ్ లో మూడు కొత్త సినిమాల నుండి అటు ఛలో నుండి పోటి ని ఎదుర్కొని బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత డల్ అయింది. మొత్తం మీద రెండో వీకెండ్ లో సినిమా 90 లక్షల వరకు షేర్ ని అందుకుంది.. దాంతో 10 రోజుల కలెక్షన్స్ ఇప్పుడు 10.5 కోట్లు అవ్వగా సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 17 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here