టచ్ చేసి చూడు రివ్యూ రేటింగ్….మాస్ మహారాజ్ కొట్టాడు కానీ!!

0
12123

      బెంగాల్ టైగర్ తర్వాత సినిమాల నుండి కొంత గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ తో మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు, ఆ సినిమా తర్వాత ఇప్పుడు టచ్ చేసి చూడు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ సినిమా తో ఎంత వరకు ఆకట్టుకున్నాడో తెలుసుకుందాం పదండీ…. పూర్తిగా పోలిస్ స్టొరీ అయిన టచ్ చేసి చూడు లో మెయిన్ థీం అంటూ సెపరేట్ కథ లేదు.

పోలిస్ లైఫ్ లో జరిగే పరిణామాలే సినిమా కథగా తెరకెక్కించాడు దర్శకుడు విక్రం సిరికొండ… సినిమా కథ మొదలు అవ్వడం పవర్ ఫుల్ విలన్ వార్నింగ్ తో మొదలు అవ్వగా తర్వాత హిరో ఫ్యామిలీ ఇంట్రోడాక్షన్ తర్వాత కొన్ని ఫ్యామిలీ సీన్స్ తర్వాత కథ మొదలు అవుతుంది.

కానీ అప్పటికే ఇంటర్వెల్ అవ్వగా సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగేలా మంచి ట్విస్ట్ తో తెరకెక్కించిన దర్శకుడు అప్పటి వరకు యాక్షన్ ని చాలా దూరం పెట్టి సడెన్ గా సెకెండ్ ఆఫ్ లో ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే ఫ్లాష్ బ్యాక్ పై ఫోకస్ పెట్టాడు.

దాంతో ఆ నరేషన్ కొంత వరకు ఎక్కినట్లే ఎక్కి ఎక్కకుండానే సినిమా క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. రవితేజ  నుండి రాజా ది గ్రేట్ లాంటి ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే వారికి సినిమా కొంతవరకు నిరాశ పరచవచ్చు. సినిమాలో కంటెంట్ అటు టోటల్ సీరియస్ గాను లేక ఇటు కామెడిగాను లేకుండా ఉంది.

ఇక రవితేజ లుక్ కూడా రాజా ది గ్రేట్ కి కంటిన్యు గా ఉండటం కొంతవరకు మైనస్ అయింది. హీరోయిన్స్ రాశిఖన్నా ఫస్టాఫ్ లో మెప్పించాగా సెకెండ్ ఆఫ్ లో సీరత్ కపూర్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుందని చెప్పొచ్చు.

సంగీతం సోసో గా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు అనిపించుకుంది…రవితేజ తన పాత్ర వరకు ఎంటర్ టైన్ మెంట్ ని పక్కకు పెడితే యాక్షన్ సీన్స్ పాటు అన్ని సీన్స్ తో ఆకట్టుకుని సినిమా మొత్తాన్ని భుజాన మోశాడు.

కానీ సినిమాకు అసలు సిసలు చిక్కు కథ రూపంలో వచ్చింది…దాన్ని తెరకెక్కించిన విధానం…అది మలిచిన స్క్రీన్ ప్లే వలన సినిమా ఎలివేట్ అవ్వలేక పోయింది. మొదటి అర్ధభాగం సోసో గా ముగించి సెకెండ్ ఆఫ్ కొంచం బెటర్ గా తీశారు అని చెప్పొచ్చు.

మొత్తం మీద సినిమా రవితేజ హార్డ్ కోర్ మాస్ ఫ్యాన్స్ కి, యాక్షన్ సీన్స్ ఇష్టపడే వారికి ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది…రాజా ది గ్రేట్ మాదిరి సినిమాలు రవితేజ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ ఇష్టపడే వారికి సినిమా సగం సంతృప్తిని మాత్రమె మిగిలిస్తుంది.

 మొత్తం మీద సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 2.5/5 స్టార్స్……మీరు సినిమా చూసి ఉంటె ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…సినిమా బాక్స్ ఆఫీస్ విశేషాల కోసం మా సైట్ ని తరచూ విజిట్ చేస్తూ ఉండండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here