ఉన్నది ఒకటే జిందగీ ప్రీమియర్ షో రివ్యూ

0
2548

   నేను శైలజ తర్వాత అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో రామ్ మధ్యలో హైపర్ అంటూ మళ్ళీ కమర్షియల్ బాట పట్టి అపజయాన్ని తన ఖాతాలో వేసుకోగా ఈసారి మళ్ళీ తనకి నేను శైలజ లాంటి క్లాస్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరమనే దర్శకత్వం లో మంచి యూత్ స్టొరీ ఉన్నది ఒకటే జిందగీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈస్ట్ కంట్రీస్ లో సాయంత్రం 6 నుండే స్పెషల్ షోలతో సినిమా రిలీజ్ అయ్యింది.

కాగా సినిమాకి అక్కడి నుండి వస్తున్న స్పందన మరీ అద్బుతంగాను యునానిమస్ గాను లేకున్నా మంచి ఫీల్ ఉన్న సినిమా అంటూ కితాబు ఇస్తున్నారట… స్నేహం ప్రేమ జీవితం లో ఎంత ముఖ్యమో జీవితం లో ఉండాల్సిన గోల్ గురించి సింపుల్ గా బ్యూటిఫుల్ గా డైరెక్ట్ చెప్పాడని అంటున్నారు.

కానీ పక్కా కమర్షియల్ మూవీస్ ని ఇష్టపడే వారు మాత్రం ఉన్నది ఒకటే జిందగీని పెద్దగా ఇష్టపడకపోవచ్చని… సినిమాలో కామెడీ లాంటి అంశాలు ఉన్నాయి కానీ అవేవి పగలబడి నవ్వేవిదంగా లేవని అంటున్నారు. సినిమా స్లో అండ్ స్టడీ సాగడం కొద్దిగా మైనస్ పాయింట్ అని అంటున్నారు.

కానీ ఫీల్ ఉన్న సినిమాలు ఇలానే ఉంటాయి కాబట్టి అలాంటి సినిమాలు ఇష్టపడే వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుందని రెగ్యులర్ సినిమాలు చూసే వాళ్ళకి మాత్రం కొంచం బోర్ గా ఉండటం ఖాయమని అంటున్నారు. మరి రెగ్యులర్ షో ల నుండి సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here