బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ ఎన్టీఆర్ గురించి ఏమన్నాడో తెలుసా??

0
9269

  టాలీవుడ్ లో ఉన్న చాలా మంది యంగ్ హీరో లకి డైలాగ్స్ పరంగా ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఎన్టీఆర్ అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్ ఏకంగా బాలీవుడ్ ని పాకింది అని చెప్పొచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని నటన లో ఇన్స్పిరేషన్ గా తీసు కుంటా నని బాలీవుడ్ లో అపజయం అంటూ తెలి యని యంగ్ హీరో వరుణ్ ధవన్ అంటు న్నాడట.

రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హేమాహేమీలు ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ కాదని ఎన్టీఆర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి కారణం కూడా చెప్పాడట. ఒక డైలాగ్ ని విన్న వెంటనే ఎలాంటి ప్రిపరేషన్స్ లేకుండా ఎన్టీఆర్ డైలాగ్ చెబుతాడు అని నాకు తెలుసు…

అయన డాన్సుల విషయంలోను అలాగే చేస్తాడని తెలిసినప్పటి నుండి అయనలా చేయాలని ఎన్టీఆర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్ననాని అంటున్నాడట. ఇప్పుడు దసరా రేసులో ఇటు ఎన్టీఆర్ నటించిన జైలవకుశ తెలుగులో అటు వరుణ్ ధవన్ నటించిన జుడ్వా 2 హిందీ లో థియేటర్స్ లో దుమ్ము లేపే వసూళ్ళతో ఇద్దరు హీరోల కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సంచలనం సృష్టించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here