తొలిప్రేమ మూవీ రివ్యూ…మళ్ళీ కొట్టిన వరుణ్ తేజ్

0
18088

       కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి సరైన విజయం కోసం సతమతం అవుతున్న హీరో వరుణ్ తేజ్ కి ఎట్టకేలకు 2017 లో ఫిదా రూపంలో అల్టిమేట్ బ్లాక్ బస్టర్ దక్కింది. ఆ సినిమా ఇటు డొమాస్టిక్ మార్కెట్ తో పాటు ఓవర్సీస్ లో కూడా సంచలన కలెక్షన్స్ ని సాధించి దుమ్ము లేపింది. అలాంటి విజయం తర్వాత వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ తొలిప్రేమ పై అందరిలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

నేడు రెగ్యులర్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలిప్రేమ సినిమా ఓవర్సీస్ లో 8 వ తేది ఈవినింగ్ నుండే స్పెషల్ ప్రీమియర్ షోలతో రిలీజ్ అయ్యింది. అక్కడ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండీ…

స్టొరీ లైన్ గురించి చెప్పాలి అంటే సింగిల్ లైన్ స్టొరీ…ట్రైన్ లో పరిచయం అయిన ఒక ప్రేమజంట కాలేజ్ లో ఏకం అయ్యి తర్వాత కొన్ని కారణాల వళ్ళ విడిపోవాల్సి వస్తుంది… మళ్ళీ కొంతకాలానికి ఒక ప్రాజెక్ట్ నిమిత్తం ఇద్దరు తిరిగి కలవడం జరుగుతుంది. అప్పుడు వారి మధ్య తిరిగి ప్రేమ ఎలా పుట్టింది ఇద్దరు ఎలా ఏకమయ్యారు అనేది సినిమా కథ.

కథ అచ్చూ రీసెంట్ గా వచ్చిన సుమంత్ “మళ్ళీరావా” ని పోలి ఉన్నా ట్రీట్ మెంట్ చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ లవ్ స్టొరీ రాషిఖన్నా క్యూట్ పెర్ఫార్మెన్స్ సినిమా ను చకచకా నడిచేలా ఫస్టాఫ్ అద్బుతమైన ఫీల్ ని కలిగించేలా ఉన్నాయి.

కానీ అదే ఫ్లో సెకెండ్ ఆఫ్ విషయంలో తగ్గడం ఒక్కటే సినిమాకు మైనస్ పాయింట్…దాంతో పాటు స్లో నరేషన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ పెద్దగా లేకపోవడం మాత్రమె మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. కానీ ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ లో అవి తక్కువగానే ఉంటాయి కానీ ఉంటే సినిమా ఇంపాక్ట్ మరింత పెరిగేది.

వరుణ్ తేజ్ తన పాత్రలో పెర్ఫెక్ట్ గా నటించి మెప్పించడమే కాదు….ఈ సారి సాంగ్స్ లో స్టెప్స్ కూడా అలరించాడు, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో రాశిఖన్నా తన క్యూట్ లుక్స్ తో సినిమాలో అద్బుతంగా నటించి మెప్పించింది. మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణులు పర్వాలేదు అనిపించుకున్నారు.

సంగీత దర్శకుడు తమన్ మంచి సాంగ్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా ఫీల్ గుడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. ఈ వీకెండ్ రిలీజ్ అయిన మూడు సినిమాలకు సంగీతం అందించిన తమన్ ఈ సినిమా విషయంలో ఎక్కువ కేర్ తీసుకున్నాడు అనిపించింది.

దర్శకుడు వెంకీ అట్లూరి కొత్త కథని చెప్పకున్నా తెలిసిన కథనే మంచి ఫీల్ గుడ్ నరేషన్ తో తెరకెక్కించి ఫస్టాఫ్ వరకు ఫుల్ మార్కులు కొట్టేయగా సెకెండ్ ఆఫ్ మాత్రం పాస్ మార్కులు సాధించాడు. వరుణ్ అండ్ రాశిఖన్నా ల నుండి మంచి పెర్ఫార్మెన్స్ ని రాబట్టుకున్నాడు.

ఓవరాల్ గా సినిమా యూత్ కి ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది…ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది…కానీ కమర్షియల్ సినిమాలు కావాలి, కామెడి కావాలి అని గట్టిగా ఫిక్స్ అయినవారికి ఈ సినిమా ఎక్కే అవకాశం చాలా తక్కువ…

మొత్తం మీద సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 3/5 స్టార్స్….ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 23 కోట్ల బిజినెస్ చేసింది…ఓవర్సీస్ నుండి ఇప్పటికే మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా ఇక్కడ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో వేచి చూడాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here