ఎన్టీఆర్-విజయ్…ఇరక్కుమ్ముతున్నారు

0
166

సౌత్ లో ప్రస్తుతం వరుస హిట్లతో జోరు మీదున్న హీరోలలో టాలీవుడ్ నుండి ఎన్టీఆర్ మరియు కోలివుడ్ నుండి విజయ్ ముందు నిలుస్తారని చెప్పొచ్చు. కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా వరుస హిట్లతో యమ జోరు మీదున్నారు ఈ ఇద్దరు స్టార్ హీరోలు.

కాగా ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ సౌత్ సినీ చరిత్రలో ఈ జనరేషన్ స్టార్ హీరోలలో ఏ హీరోలు చేయని పనిని చేయబోతున్నారు. అదేంటంటే తమ అప్ కమింగ్ మూవీస్ లో ఈ ఇద్దరు హీరోలు ట్రిపుల్ రోల్స్ లో రచ్చ రచ్చ చేయబోతున్నారు.

ఎన్టీఆర్ 27 వ సినిమాలో తన నట విశ్వరూపం చూపబోతుండగా కోలివుడ్ స్టార్ హీరో విజయ్ తెరీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీ డైరెక్షన్ లో త్వరలో చేయబోయే సినిమాలో కూడా తొలిసారిగా ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడు…దాంతో టాలీవుడ్ తలైవా కోలివుడ్ తలైవాల నట విశ్వరూపం చూడటానికి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here