విజయ్ ఆంటోని “ఇంద్రసేన” మూవీ రివ్యూ రేటింగ్!!

0
1446

        బిచ్చగాడు అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు నాట సంచలన కలెక్షన్స్ సాధించి ఎవ్వరి ఊహలకు అందని విజయాన్ని సొంతం చేసుకున్న హీరో విజయ్ ఆంటోని…ఆ సినిమా హక్కులు కేవలం 40 లక్షలే అమ్ముడు పోయి టోటల్ రన్ లో ఏకంగా 18 కోట్లకు పైగా షేర్ సాధించింది అంటే ఎంతటి విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు, అలాంటి విజయం తర్వాత విజయ్ ఆంటోని నటించిన భేతాలుడు మరియు యమన్ సినిమాలు అనుకున్న రేంజ్ ఫలితాలు ఇవ్వలేదు.

 

ఇలాంటి సమయంలో ఇంద్రసేన అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు లో అలాగే తమిళ్ లో అన్నా దొరై పేరుతొ ఏక కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోని సినిమా ఎలా ఉందో తెలుసు కుందాం పదండి..కథ గురించి చెప్పడానికి ఏమి లేదు…సింపుల్ స్టొరీ…..

ఇద్దరు కవలలు…ఒకరు సింపుల్ గా ఉంటారు మరొకరు కొంచం హార్డ్…అనుకోకుండా ఒకరికి అన్యాయం జరగడం అందులో ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది…తర్వాత వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు ఏంటి అనేది క్లుప్తంగా సినిమా కథ అని చెప్పొచ్చు.

బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోని సినిమాలపై అందరి లోను ఆసక్తి పెరిగిపోగా విజయ్ ఆంటోని భేతాలుడు తో కొద్దిగా ఆకట్టుకున్నా యమన్ పూర్తిగా నిరాశపరిచింది. ఇప్పుడు ఇంద్రసేన ఆ రెండు సినిమాల మాదిరిగానే యావరేజ్ అని చెప్పాలి.

రియల్ గా జరుగుతున్నట్లు అనిపించినా కథ స్లో గా ఉండటం… కథ లో పెట్టు లేకపోవడం సినిమాకి మైనస్ పాయింట్స్…ఇలాంటి కథ కి విజయ్ ఆంటోని తన వరకు న్యాయం చేసినా కథ లో పట్టు లేని కారణంగా అవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవు.

మిగిలిన పాత్రలు అన్నీ ఓకే అనిపిస్తాయి. సంగీత దర్శకుడిగాను విజయ్ ఆంటోని పాస్ మార్కులు వేయించుకోలేకపోయాడు. ఇక దర్శకుడు శ్రీనివాసన్ సినిమా కథ ను తెరకెక్కించిన విధానం యావరేజ్ అనే చెప్పాలి. మంచి ఫామ్ లో ఉన్న విజయ్ ఆంటోని కి ఇది వరుసగా మూడో అడ్డంకి గా మారడం పక్కా అనిపిస్తుంది.

విజయ్ అంటోని ఇది వరకు చేసిన సలీమ్ సిరీస్ లాంటి సినిమాలు ప్రస్తుతం చేయాల్సిన సినిమాలు అని చెప్పొచ్చు. మళ్ళీ అలాంటి సినిమాల కోసం ఎదురు చూస్తున్న విజయ్ ఆంటోనికి ఇంద్రసేన లాంటి కథలు ఎంచుకోవడం మానేస్తే బెటర్ అని చెప్పొచ్చు. మొత్తం మీద ఇంద్రసేన కి మేము ఇస్తున్న రేటింగ్ 2.5/5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here