2 రోజుల్లో 65 కోట్లు…ఇలయధలపతి వీరలెవల్ విద్వంసం ఇది

0
1133

  కోలివుడ్ స్టార్ హీరో ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 45 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి సంచలనం సృష్టించగా ఇప్పుడు రెండో రోజు కూడా అదే రేంజ్ జోరు ని ప్రదర్శించింది అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎబో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వసూళ్ళ పరంగా తమిళ్ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసింది.

రెండో రోజు ట్రేడ్ లెక్కల ప్రకారం తమిళనాడు లో 16 కోట్ల గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.2 కోట్ల గ్రాస్ ని టోటల్ ఓవర్సీస్ లో 2 కోట్ల గ్రాస్ ని అందుకుందట ఈ సినిమా. దాంతో టోటల్ గా రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 65 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.

ఇక సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి తమిళ్ లెక్కల ప్రకారం 200 కోట్ల గ్రాస్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా ఇదే జోరు ని కొనసాగిస్తే కచ్చితంగా దీపావళి వీకెండ్ లో దుమ్ము లేపే వసూళ్లు సాధించే చాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here