విజయ్ మెర్సల్ ఫేక్ కలెక్షన్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

0
888

  కోలివుడ్ స్టార్ హీరో ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే…. తమిళ్ ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా ఏకంగా టోటల్ రన్ లో రికార్డ్ లెవల్ లో 250 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి తమిళ్ ఇండస్ట్రీ రికార్డులను అన్నీ బ్రేక్ చేసి సంచలనం సృష్టించిందని వారు చెప్పడం తో టోటల్ సౌత్ మొత్తం కలెక్షన్స్ చూసి షాక్ అయ్యింది.

కానీ సడెన్ గా గతకొన్ని రోజులుగా మూవీ కలెక్షన్స్ లో ఫేక్ కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని కొందరు డిస్ట్రిబ్యూటర్లు, తోటి నిర్మాతలు చెబుతుండటంతో అందరూ షాక్ లో మునిగిపోగా ఇప్పుడు కొందరు విశ్లేషకులు నిర్మాతలు సినిమా కలెక్షన్స్ లో ఏకంగా…..

50 నుండి 60 కోట్ల రేంజ్ లో ఫేక్ కలెక్షన్స్ ని యాడ్ చేసి సినిమాను 200 కోట్ల నుండి 250 కోట్ల లీగ్ లో అడుగు పెట్టేలా చేశారు అంటూ విమర్శిస్తున్నారు. తమిళ్ కలెక్షన్స్ లో ఎక్కువగా యాడ్ చెప్పే అలవాటు ఉన్నా ఇంతలా ఫేక్ కలెక్షన్స్ ని యాడ్ చేస్తారా అంటూ ఇప్పుడు అందరూ ఆశ్యర్యపోతున్నారు. మరి ఈ కలెక్షన్స్ లో నిజమెంతో నిర్మాతకే తెలియాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here