విజయ్ మెర్సల్ టాక్ ఏంటో తెలుసా..?? ఓపెనింగ్స్ లో సునామీ

0
2164

  కోలివుడ్ తలైవా ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ నాట ఆల్ టైం రికార్డ్ లెవల్ లో ఓపెన్ అయ్యింది. కాగా ఈ మధ్య వరుసగా అద్బుతమైన రికార్డ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న విజయ్ ఈ సినిమా ఆ రికార్డులన్నీ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా సినిమాకి ఆడియన్స్ నుండి వస్తున్న టాక్ కూడా పాజిటివ్ గానే ఉందని చెప్పొచ్చు.

మూడు పాత్రల్లో విజయ్ నటన యాటిట్యూడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది…ఫస్టాఫ్ మొత్తం ఎంతో రిచ్ విజువల్స్ తో ఆకట్టుకోగా సెకెండ్ ఆఫ్ మాత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉందని అంటున్నారు. కానీ అది అక్కడ వాళ్లకి బాగా కనెక్ట్ అయ్యింది.

మెడికల్ ఫీల్డ్ పై హార్డ్ హిట్టింగ్ స్టేట్ మెంట్స్ తో సినిమా మంచి మెసేజ్ తో ముగుస్తుందని మొత్తం మీద సినిమా భారీ  అంచనాలను జస్ట్ లో మిస్ అయినా బాగుందని అంటున్నారు. ఇక ఓపెనింగ్స్ పరంగా తమిళ్ లో నాన్ రజినీ రికార్డులన్నీ బ్రేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు. మరి తొలిరోజు వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here