ఏంటి సామి ఈ రచ్చ..టాప్ 2 తో పంబ రేపిన విజయ్…రికార్డ్ తెలిస్తే…??

0
3526

సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఇలయధలపతి విజయ్ ఒకరు… హిట్లకు ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా సినిమా సినిమా కి క్రేజ్ ని పెంచుకుంటూ దూసుకు పోయే విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ ఆల్ టైం రికార్డులతో తమిళ్ ఇండస్టీ రికార్డులతో పాటు ఇప్పుడు సౌత్ ఇండియన్ రికార్డులను కూడా బ్రేక్ చేసి ఏకంగా ఇండియన్ రికార్డులను అందుకుంటూ దూసుకు పోతూ విజయ్ క్రేజ్ పవర్ ఏంటో తెలియజేస్తుంది.

కాగా సినిమా తమిళ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఏకంగా 240 కోట్ల గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతుండగా టోటల్ రన్ లో 250 కోట్ల మార్క్ ని టచ్ చేసే చాన్స్ ఉందని అంటున్నారు. తెలుగు వర్షన్ కూడా ఉండటం సినిమాకు మరింత అడ్వాంటేజ్ అంటున్నారు.

కాగా ఈ ఏడాది బాహుబలి తర్వాత ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన సినిమాల్లో 200 కోట్ల గ్రాస్ ని అందుకున్న సినిమాలు తక్కువే అందులో ఇప్పుడు మెర్సల్ 240 తో టాప్ 2 లో ఉండగా గోల్ మాల్ 4 238 కోట్లతో మూడో ప్లేస్ లో ఉంది.అన్ని దేశాల వసూళ్లు చూసుకుంటే గోల్ మాల్ 4 300 కోట్లకు పైగా గ్రాస్ తో టాప్ 2 లో నిలిచిందని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here