విజయ్ “సర్కార్” కేరళ రేటు…టోటల్ కోలీవుడ్ మైండ్ బ్లాంక్!

0
2968

కోలీవుడ్ లో రజినీ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరో ఇళయధలపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కార్…ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై అంచనాలు మాత్రం ఊహకందని లెవల్ లో ఉన్నాయని చెప్పొచ్చు..

మెర్సల్ తో ఆల్ టైమ్ కోలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన విజయ్ నుండి వస్తున్న అప్ కమింగ్ మూవీ అవ్వడంతో బిజినెస్ పరంగా అన్నీ ఏరియాల్లో దుమ్ము లేపుతున్న ఈ సినిమా కేరళలో మాత్రం టోటల్ కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే బిజినెస్ ని సొంతం చేసుకుందట.

కోలీవుడ్ మూవీస్ లో అక్కడ 6 కోట్ల కి మించి ఏ సినిమా బిజినెస్ చేయలేదు…కానీ సర్కార్ సినిమా మాత్రం ఏకంగా 8.1 కోట్ల బిజినెస్ చేసిందట…ఈ రేంజ్ లో బిజినెస్ చూసి కోలీవుడ్ ట్రేడ్ అనలిస్టుల మైండ్ బ్లాంక్ అయ్యిందట…సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విజయ్ మెర్సల్ ని మించే రికార్డులు సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here