విజయ్ సర్కార్ కి తెలుగు లో కెరీర్ బెస్ట్ రేటు…

0
2197

తమిళ్ లో రజినీ కాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో ఇళయ ధలపతి విజయ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ సర్కార్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రీసెంట్ గా మెర్సల్ సినిమాతో కోలీవుడ్ ఆల్ టైమ్ రికార్డులను తిరగరాశాడు విజయ్.

ఆ సినిమా 127 కోట్లకు పైగా షేర్ ని 244 కోట్ల గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించడం తో సర్కార్ సినిమా పై క్రేజ్ మరింతగా పెరిగింది. అది క్రమంగా తెలుగు లో కూడా పాకి ఇక్కడ సినిమాకి మంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తున్నాయి.

రీసెంట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కి తెలుగు లో బిజినెస్ పరంగా 10 కోట్ల రేంజ్ లో ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. అంటే విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రేటు అని చెప్పొచ్చు. మెర్సల్ ఇక్కడ 6 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి హిట్ అయ్యింది. మరి సర్కార్ ఏం చేస్తుందో తెలియాలి అంటే ధీపావళి వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here