విక్రమ్ సామి తెలుగు లో ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో తెలుసా?

0
473

కోలీవుడ్ హీరోలలో టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉన్న హీరోలలో విక్రమ్ ఒకరు…అప్పుడెప్పుడో అపరిచితుడు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విక్రమ్ మళ్ళీ అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు. తమిళ్ లో అడపా దడపా ఒకటి ఆరా యావరేజ్ మూవీస్ పడుతున్నా…

తెలుగు లో మాత్రం అస్సలు హిట్ అనేదే లేదు….ఇలాంటి సమయంలో తనకి తమిళ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సామి సినిమాకి సీక్వెల్ గా సామి 2 ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా శుక్రవారం రిలీజ్ చేయబోతున్నాడు విక్రమ్.

కాగా ఈ సినిమా రెండు రాష్ట్రాలలో 6 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా 500 వరకు థియేటర్స్ లో ఈ సినిమా ఇక్కడ రిలీజ్ కాబోతుంది. నైజాంలో 180 వరకు థియేటర్స్ లో ఆంధ్రా సీడెడ్ లలో 300 నుండి 320 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా తో అయినా కంబ్యాక్ చేస్తాడో లేదో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here