24 గంటల్లో ఎన్ని ట్వీట్స్ వచ్చాయో తెలుసా?

0
723

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా వినయ విధేయ రామ… అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా ఆ ఫస్ట్ లుక్ కి వస్తున్న రెస్పాన్స్ మాత్రం పీక్స్ లో ఉందని చెప్పాలి. ఇక ఫస్ట్ లుక్ సోషల్ మీడియా లో తొలి 24 గంటల్లో టోటల్ గా ఎన్ని ట్వీట్స్ ని సాధించింది అనేది ఆసక్తిగా మారగా…

ఓవరాల్ గా 24 గంటల్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ సుమారు 2 లక్షల 80 వేలకి పైగా ట్వీట్స్ ని 24 గంటల్లో సాధించింది. ఇది మరీ రికార్డ్ బ్రేకింగ్ ట్వీట్ కౌంట్ కాకున్నా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫస్ట్ లుక్ ట్రెండ్స్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది.

ఇక సినిమా అఫీషియల్ టీసర్ ఈ నెల 9 న ఉదయం 10 గంటల 25 నిమిషాలకి రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో కచ్చితంగా టీసర్ యూట్యూబ్ రికార్డుల దుమ్ము దుమారం చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మరి వినయ విధేయ రామ సినిమా తో రామ్ చరణ్ మరెన్ని అద్బుతాలు నమోదు చేస్తాడో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here