అజిత్ విశ్వాసం టాక్ ఏంటి…హిట్టా-ఫ్లాపా!!

0
1751

కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విశ్వాసం ఈ రోజు భారీ గా రిలీజ్ అయ్యింది,  డైరెక్టర్ శివ తో అజిత్ కి ఇది వరుసగా 4 వ సినిమా అని చెప్పాలి, వీరి కాంబో లో ఇది వరకు వచ్చిన మూవీస్ లో వివేగం మాత్రం భారీ గా నిరాశ పరిచింది, ఇలాంటి సమయం లో పక్కా నాటు తమిళ్ ఫ్లేవర్ తో వచ్చిన ఈ సినిమా కి పేట నుండి పోటి వచ్చినా కానీ..

అప్పటికే జోరు అందుకున్న అడ్వాన్స్ బుకింగ్స్ తో మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా, ఇక సినిమా టాక్ కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. మరీ అద్బుతం అనిపించే కథ కాకపోయినా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయని అంటున్నారు.

ఫస్టాఫ్ బాగున్నా సెకెండ్ ఆఫ్ స్లో నరేషన్ ఉంటుందని, కానీ అజిత్ సినిమాను చాలా వరకు నిలబట్టాడని, ఈజీ గా ఒకసారి చూడోచ్చు అన్న టాక్ వినిపిస్తుంది, మరి ఈ టాక్ తో విశ్వాసం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here