షాకింగ్ న్యూస్…విలన్ కి అంత ఏంటి సామి!!

0
4061

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సాధించిన అల్టిమేట్ విజయం తో ఒక్కసారిగా రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ పై అంచనాలు పీక్స్ లో పెరిగి పోయాయి. రామ్ చరణ్ రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చేస్తున్న సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా మొదలు అయిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ సినిమా కోసం సౌత్ కి ఇది వరకు వచ్చిన వివేక్ తొలిసారిగా టాలీవుడ్ మూవీస్ లో విలన్ గా చేయడానికి ఒప్పుకోవడం విశేషం…

కాగా ఈ సినిమా కి గాను విలన్ గా చేస్తున్నందుకు ఏకంగా వివేక్ ఒబెరాయ్ కి 3.2 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో విలన్ రోల్ కి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకున్న ఏకైక నటుడిగా వివేక్ ఒబెరాయ్ అల్టిమేట్ రికార్డును ఈ సినిమా తో అందుకోనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here