ఆ రోల్ ఎన్టీఆర్ చేసి ఉంటేనా!!

0
875

ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్స్ మూవీస్ కనిపిస్తున్నాయి, టాలీవుడ్ లో ఈ ట్రెండ్ గత ఏడాది మహానటి తో పీక్స్ కి చేరింది అని చెప్పాలి, సావిత్రి గారే తిరిగి వచ్చి యాక్ట్ చేశారా అనేంతగా కీర్తి సురేష్ అద్బుత నటన తో మహానటి అందరి మన్నలను సొంతం చేసుకుని ఎపిక్ విజయాన్ని సొంతం చేసుకుని చరిత్ర కెక్కింది, తర్వాత రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా స్వర్గీయ…

సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కగా సినిమా కి మరీ మహానటి రేంజ్ టాక్ కాకపోయినా మంచి పాజిటివ్ టాక్ లభించినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఏమాత్రం జోరు చూపలేక చేతులు ఎత్తేసి అందరినీ నిరాశ పరిచింది ఎన్టీఆర్ కథా నాయకుడు సినిమా….

సినిమా ఫ్లాఫ్ కి కారణాలు ఎన్ని అయినా అయి ఉండొచ్చు… కానీ సినిమా లో సీనియర్ ఎన్టీఆర్ ని బాలయ్య ఎంతవరకు మరిపించ గలిగాడు అంటే మాత్రం 50 ఏళ్ల ప్లస్ ఏజ్ నుండి చేసిన ప్రతీ సీన్ లో కూడా సీనియర్ ఎన్టీఆర్ ని మరిపించాడు బాలయ్య.

కానీ యంగ్ ఎన్టీఆర్ లా మాత్రం బాలయ్య గెటప్ ఏమాత్రం ఆకట్టుకోలేదు అన్నది అందరు ఒప్పుకున్న నిజం, ఆ రోల్ కి బాలయ్య తాను కాకుండా సీనియర్ ఎన్టీఆర్ పోలికలు ఎక్కువగా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తీసుకుని ఉంటే బాగుండేది అన్న వాదన.

మొదటి రోజు నుండే వినిపించిన విషయం తెలిసిందే, బయోపిక్ అంటే ఆ కథ ఎవరిదీ అన్నది గుర్తు రాకుండా ఆ కథ లో హీరో తిరిగి వచ్చి చేశాడా అనిపించే విధంగా ఉంటే నే ఆ బయోపిక్ నూటికి నూరు మార్కులు గెలుచుకోగలదు. మహానటి విషయం లో జరిగింది కూడా ఇదే.

కానీ ఎన్టీఆర్ కథానాయకుడు లో సగానికి పైగా సినిమాలో చాలా సన్నివేశాల్లో సీనియర్ ఎన్టీఆర్ లా బాలయ్య మెప్పించినా చేసేది బాలయ్యే కానీ ఎన్టీఆర్ కాదు అని యిట్టె గుర్తు పట్టేయగళం, అదే సమయం లో 50 ఏళ్ల పై బడిన ఎన్టీఆర్ ల బాలయ్య నటన అమోహం.

దాంతో యంగ్ ఎన్టీఆర్ లా జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకుని ఉంటే ఆ ఇంపాక్ట్ మరో రేంజ్ లో ఉండేదని, అది బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా భారీ ఇంపాక్ట్ చూపేదని అంటున్నారు, మరి ఇది ఎంతవరకు నిజం అయ్యేదో ఏమో…

మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here