చరిత్రలో తొలిసారి…నిర్మాతలు మేలుకోండి…ఏమైనా చేయండి!!

0
2483

ఎంత పెద్ద సినిమా అయినా పబ్లిసిటీ అనేది అత్యంత ముఖ్యం…ఎంతటి క్రేజ్ ఉన్న బాహుబలి కి కూడా భారీ పబ్లిసిటీ చేశారు…అలా చేశారు కాబట్టే సినిమా అనుకున్న స్థాయిని కూడా మించి అద్బుతమైన కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది…చాలా వరకు సినిమాల విషయంలో పబ్లిసిటీ చేయి నిలబెట్టుకున్న సినిమాలు ఉన్నాయి…అది మదిలో పెట్టుకుని అజ్ఞాతవాసి కి ఆ సినిమా నిర్మాతలు రిలీజ్ సమయంలో ఇక్కడ పబ్లిసిటీ ఎందుకు చేయడం లేదు అనేది ఇప్పుడు టాలివుడ్ లో వినిపిస్తున్న వాదన.

నిర్మాతలు ఇప్పటి వరకు ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు…పవన్ త్రివిక్రమ్ ల క్రేజ్ వల్ల ఓపెనింగ్ రోజున ఫ్యాన్స్ వెళ్ళినా కామన్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ లో అడుగు పెట్టాలి అంటే సినిమాలో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్ టీసర్లు….స్టార్స్ తో ఇంటర్వ్యులు లాంటివి ప్లాన్ చేయాల్సి ఉంటుంది…

కానీ ఇప్పటి వరకు అలాంటిది జరగలేదు…పండగ సందర్భంగా జరుగుతాయి అనుకున్నా ఇప్పటి వరకు అనౌన్స్ మెంట్ లేదు….మరి కామన్ ఆడియన్స్ థియేటర్స్ కి ఎందుకు వెళతారు…మొదటి నుండి అజ్ఞాతవాసి నిర్మాతలు అభిమానుల పేషన్స్ ని పరీక్షించారు…టీసర్ కానీ ట్రైలర్ కి ఊరించి ఊరించి చాలా ఆలస్యంగా రిలీజ్ చేశారు.

ఇప్పుడు సినిమాను 125 కోట్లకు అమ్మి మూడురోజుల్లో కేవలం 46 కోట్లు మాత్రమె వెనక్కి తీసుకు రాగలిగారు…ఇకమీద అయిన కొంచం పబ్లిసిటీ చేయడం లాంటివి చేస్తే పండగ సమయంలో అయినా బెటర్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉంది మరి ఎం జరుగుతుందో చూడాలి.

ఇలాంటి సమయంలో పబ్లిసిటీ కి బదులు సినిమాలో వెంకటేష్ సీన్స్ ని యాడ్ చేశాం…కొన్ని బోర్ సీన్స్ ని తొలగించాం అని చెప్పడం మాత్రం చేశారు నిర్మాతలు…కానీ సినిమా కి ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి అంటే అది సరిపోతుందో లేదో ఈ పండగ సమయంలో తేలిపోతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here