ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం…2 రోజుల్లో….??

0
2262

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా నాలుగు సినిమాలుగా సినిమా సినిమాకి తన రేంజ్ ని క్రేజ్ ని పెంచుకుంటూ దూసుకుపోతుండగా మొదటి సారిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న అరవింద సమేత వీర రాఘవ మరో 30 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరుసగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఎన్టీఆర్ కి సినిమా కీలకంగా మారగా దర్శకుడిగా అజ్ఞాతవాసితో, కథా రచయితగా చల్ మోహన్ రంగతో విఫలం అయిన త్రివిక్రమ్ కి ఈ సినిమా మరింత కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో ఫస్ట్ లుక్ అండ్ టీసర్ తో ఇద్దరూ కుమ్మెశారు.

ఇప్పుడు మరో రెండు రోజుల్లో వినాయక చవితి కానుకగా సినిమాలో మరో స్పెషల్ లుక్ ని సెకెండ్ లుక్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక ఇప్పటి నుండి నాన్ స్టాప్ గా అరవింద సమేత ప్రమోషన్స్ మొదలు అవుతాయని చెబుతున్నారు. అక్టోబర్ 11 న సినిమా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిధ్ధం కానున్న విషయం తెలిసిందే.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here