యుద్ధం శరణం మూవీ స్పాట్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్

0
1776

  కొన్ని వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న సమయం లో వరుసగా ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో లాంటి వైవిధ్య భరితమైన సినిమాల తో తిరిగి గాడిలో పడ్డ నాగచైతన్య…. రీసెంట్ గా రారండోయ్ వేడుకచూద్దాం అంటూ నికార్సయిన సూపర్ డూపర్ హిట్ కొట్టాడు…ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఇప్పుడు యుద్ధం శరణం అంటూ యాక్షన్ అండ్ లవ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందు కు వచ్చాడు నాగచైతన్య.

కాగా సినిమా మొత్తం చూశాక సాహసం శ్వాసగా సాగిపో పార్ట్ 2 లా అనిపించక మానదు…కానీ ఇక్కడ ప్లస్ ఏంటి అంటే కథలో మంచి ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ కూడా ఉన్నాయి…ఫస్టాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో సాగిపోగా సెకెండ్ ఆఫ్ మొత్తం హీరో విలన్ మైండ్ గేమ్స్ తో రన్ అవుతుంది.

సినిమా సెకెండ్ ఆఫ్ స్లో అవ్వడం…ఎందుకో ఓ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాపై ఏమాత్రం హైప్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్…సీనియర్ హీరో శ్రీకాంత్ చాలాకాలం తర్వాత మళ్ళీ విలన్ రోల్ లో అదరగొట్టేశాడు…ఆయన కోసం సినిమా చూసేయోచ్చు అనేంత పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాడు.

నాగచైతన్య తన నటనలో మరింత రాటుదేలినట్లుగా కనిపించాడు…సినిమా మొత్తాన్ని తన భుజాన మోశాడు…కానీ సినిమా స్లోగా సాగుతున్న ఫీలింగ్ మొదటి నుండి చివరి వరకు ఉండటంతో సినిమాలో మనం అంత ఈజీగా ఇన్వాల్వ్ అవ్వలేము…

వీటిని పట్టించుకోకుండా సినిమా చూస్తె ఇది ఓ మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు..మరి కామన్ ఆడియన్స్ ఎంతవరకు సినిమాను ఓన్ చేసుకుంటారు అనే దానిపై సినిమా విజయవకాశాలు ఆధారపడిఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here