24 గంటల్లో 40 మిలియన్…ఏం రికార్డ్ సామి

0
426

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జీరో… డ్వార్ఫ్ (మరుగుజ్జు) గా నటిస్తున్న ఈ మూవీ పై అంచ నాలు ఆకాశాన్ని అంటాయి. చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత బాలీవుడ్ లో నికార్సాయిన హిట్ లేక 5 ఏళ్లుగా క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న కింగ్ ఖాన్ ఈ సినిమా తో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన రేంజ్ లో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తు న్నాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అల్టిమేట్ రికార్డులను తొలి 24 గంటల్లో సాధించి భీభత్సమైన వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకుంది. వ్యూస్ పరంగా ఇండియా లో మరే ట్రైలర్ కి రానంతగా 40 మిలియన్ వ్యూస్ ని 24 గంటల్లో సాధించి దుమ్ము లేపిన ఈ ట్రైలర్…

లైక్స్ పరంగా ఏకంగా అవెంజర్స్ ట్రైలర్ 22 గంటల్లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ ని అందుకుంటే జీరో ట్రైలర్ కేవలం 18 గంటల్లో ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది. మొత్తం మీద 24 గంటలలో 40 మిలియన్ వ్యూస్ ని 1.2 మిలియన్ లైక్స్ ని సాధించి దిమ్మతిరిగే రికార్డులతో దుమ్ము దుమారం చేసింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here