గాసిప్స్ న్యూస్

అందుకే అన్నది ఈ సినిమా మోస్ట్ వాంటెడ్ మూవీ అని…10 అంటే అరాచకం అసలు!!

యువ సామ్రాట్ నాగ చైతన్య మరియు సాయి పల్లవి ల కాంబినేషన్ లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ, అన్నీ అనుకున్నట్లు జరిగితే లాస్ట్ ఇయరే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా అప్పుడు ఫస్ట్ వేవ్ వలన పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు సమ్మర్ రిలీజ్ అనుకుంటే ఇప్పుడు సెకెండ్ వేవ్ వలన ఇబ్బందులను ఎదురుకుంటూ పోస్ట్ పోన్ అవుతూ ఉండగా…

సినిమా సాంగ్స్ కి అండ్ కాంబినేషన్ పై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న నేపద్యంలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా క్రేజ్ ఓ రేంజ్ లో ఉన్న కారణంగా రేటు ఎంతైనా పర్వాలేదు సినిమాను డైరెక్ట్ గా…

డిజిటల్ రిలీజ్ చేయించాలని బిగ్ OTT యాప్స్ అన్నీ కూడా తెగ ట్రై చేసినా కానీ మేకర్స్ ఎప్పటికప్పుడు నో చెబుతూ సినిమాను ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని తెగేసి చెప్పారు. అయినా కానీ ఆఫర్స్ వెల్లువ ఆగడం తగ్గక పోవడం తో రీసెంట్ గా సినిమా…

త్వరలోనే థియేటర్స్ లో వస్తుందని చెబుతూ సినిమా పై ఎలాంటి క్రేజ్ ఉందో చెబుతూ ఇప్పటి వరకు ఏ సినిమా కి కూడా రాని విధంగా లవ్ స్టొరీ సినిమా కి డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కోసం 10 కి పైగా క్రేజీ డీల్స్ వివిధ OTT ప్లాట్ ఫామ్స్ నుండి తమకి వచ్చాయని సినిమా క్రేజ్ కి ఇది నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు.

తెలుగు లో ఈ రేంజ్ లో డీల్స్ మరే సినిమా కి రాలేదని కూడా చెబుతూ ఉండటం సినిమా క్రేజ్ కి నిదర్శనం, ప్రజెంట్ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ మూవీ గా నిలిచిన ఈ సినిమా పరిస్థితులు బాగుంటే ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పాలి.

Leave a Comment