న్యూస్ రివ్యూ

అంధకారం రివ్యూ…3 గంటలు….అయినా కుమ్మింది సినిమా!

కొన్ని కొన్ని సార్లు ఎలాంటి అంచనాలు లేకుండా చూసే కొన్ని చిన్న సినిమాలు అంచనాలను మించి అలరిస్తాయి, ఇక థ్రిల్లర్ మూవీస్ అయితే అందులో స్టార్ కాస్ట్ ని కూడా పట్టించుకోకుండా సినిమా బాగుంటే ఓ రేంజ్ లో హైప్ వచ్చేస్తుంది, ప్రస్తుతం సోషల్ మీడియా లో ఇలాంటి హైప్ నే సొంతం చేసుకుంటున్న సినిమా అంధకారం, డైరెక్టర్ అట్లీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ అయింది.

తమిళ్ అండ్ తెలుగు రెండు భాషల్లో రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… కథ పాయింట్ చెబితే థ్రిల్ మిస్ అవుతుంది కానీ సినిమా ఓపెన్ అవ్వడం ఒక డాక్టర్ ని పేషెంట్ షూట్ చేయడం తర్వాత తానూ షూట్ చేసుకోవడం తో మొదలు అవుతుంది.

తర్వాత ఓ ముగ్గురు ఒక ఫోన్ కాల్ తర్వాత తాము కూడా సూసైడ్ చేసుకుంటారు, దీనంతటికీ కారణం ఏంటి, అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే, ఇది మెయిన్ పాయింట్ అయినా సినిమాలో ఉప కథలు చాలా ఉంటాయి, అవే సినిమా కి కీలక మలుపులు తిప్పుతాయి.

మొత్తం మీద 3 ఉపకథలు కీలకం కాగా ఒకటి డాక్టర్ పాత్ర, ఒకటి అంధుడి పాత్ర మరొకటి క్రికెట్ కోచ్ పాత్ర ల చుట్టూ మెయిన్ కథ తిరుగుతుంది, ఆ కథలు కనెక్ట్ అవుతున్నట్లే అనిపిస్తాయి కానీ పెర్ఫెక్ట్ కనెక్షన్ ఎంటో తెలియదు, అలా సినిమా ముందుకు ఆసక్తిగా సాగుతూ ఉంటుంది కానీ…

కనెక్షన్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న టైం లో క్లైమాక్స్ 20 నిమిషాల పాటు సినిమా పలు ట్విస్ట్ లు తిరిగి ముందు ముడిపడిన చిక్కు ముడులు అన్నీ కూడా ఒక్కొటిగా వివరిస్తూ విప్పుతుంది. అప్పుడు సినిమా ఇంతేనా అనిపిస్తుంది కానీ సినిమా మొత్తం పూర్తి అవుతుంది.

పెర్ఫార్మెన్స్ పరంగా ఉన్నవి తక్కువ రోల్స్ అయినా అందరూ అద్బుతంగా నటించారు, “నా పేరు శివ”లో సైకో కుర్రాడిగా కనిపించిన వినోద్ కిషన్ ఇందులో అంధుడిగా అద్బుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వగా “ఖైదీ” లో వన్ ఆఫ్ విలన్ గా నటించిన అర్జున్ దాస్….

కథను అద్బుతంగా మలుపు తిప్పే రోల్ లో నటించారు, ఇక స్వామిరారా ఫేం పూజా రామచంద్రన్ తన రోల్ ని అద్బుతంగా పోషించగా డాక్టర్ ఇంద్రన్ పాత్రలో కుమార్ నటరాజన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగా మెప్పించింది, తెలుగు డైలాగ్స్ బాగానే సెట్ అయ్యాయి.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే సాలిడ్ గా ఉంది, సినిమా లెంత్ 3 గంటలు అయినా ఒక్కసారి సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాక సినిమా పూర్తి అయ్యాకే తెలుస్తుంది సినిమాను చూసేశాం అని, ఇక సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయే విధంగా మెప్పించింది.

ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా డైరెక్షన్ పరంగా వి.విజ్ఞరాజన్ అద్బుతమైన థ్రిల్లర్ ని తీశారని చెప్పొచ్చు. థ్రిల్లర్ అంటే ఈ మధ్య హర్రర్ కామెడీ, లేదా ఓన్లీ హర్రర్ మూవీస్ మాత్రమే వస్తుండగా ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆదరగోట్టేసింది. ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే….

లెంత్ ఎక్కువ తీసుకోవడం, ఇదొక్కటి సినిమా అయ్యాక ఈ పాయింట్ చెప్పడానికి ఇంత టైం పట్టిందా అనిపిస్తుంది కానీ చూసేటప్పుడు పెద్దగా పట్టించుకొం. అలాగే ఎక్కువ సేపు డ్రాగ్ చేశారు అనిపిస్తుంది, ఇవి రెండు ఒకే విధంగానే ఉన్నా సినిమా చూశాక ఇవి అనిపించక మానవు…. అయినా కానీ రీసెంట్ టైం లో…

వచ్చిన మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లో అంధకారం సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. లెంత్ కొంచం తగ్గించి ఉంటె మరింత బాగుండేది అనిపిస్తుంది. మీరు థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడితే సినిమా బాగా నచ్చుతుంది, రొటీన్ మూవీస్ చూసే వారికి సెకెండ్ ఆఫ్ నుండి సినిమా బాగా కనెక్ట్ అయ్యి క్లైమాక్స్ తో…

సినిమా నచ్చడం ఖాయం…. కొత్తదనం కోరుకునే వారు కచ్చితంగా ఈ సినిమాను చూడొచ్చు. ఓవరాల్ గా 3 గంటల లెంత్ ఉన్నా కానీ సినిమా ఆడియన్స్ ని మెప్పించే సత్తా పుష్కలంగా ఉన్న సినిమా అని చెప్పాలి. సినిమా మా ఫైనల్ రేటింగ్ 3 స్టార్స్

Leave a Comment