న్యూస్ బాక్స్ ఆఫీస్

అక్కడ డిసాస్టర్ అన్నారు…..అయినా 150 ఏంటి సామి అసలు!

సినిమా పై విమర్శలు లేదా క్రేజ్ ఎంత ఉంటె సినిమా కి అంత ఉపయోగం అనే చెప్పాలి, అదే ఇప్పుడు నిజం అయ్యింది కూడా… బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ లారెన్స్ డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ లక్ష్మీ రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే, కాగా సినిమా కి సౌత్ లో పర్వాలేదు బాగుంది లాంటి టాక్ లభించినా కానీ…

నార్త్ ఆడియన్స్ అండ్ బాలీవుడ్ వాళ్ళు మాత్రం సినిమా పరమ బోరింగ్ మూవీ డిసాస్టర్ అని డిక్లేర్ చేశారు. దాంతో సినిమా ను ఇక ఎవ్వరూ పట్టించుకోరు అని అంతా భావించారు కానీ సినిమా అందరికీ షాక్ ఇచ్చింది అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి ఊహకందని రిజల్ట్ ని ఇస్తుంది.

సినిమాకి నార్త్ లో ఎంతలా నెగటివ్ టాక్ లభించినా కానీ సినిమా మొదటి రోజే ఏకంగా 100 మిలియన్స్ దాకా వ్యూస్ ని ఇండియా వైడ్ గా సొంతం చేసుకుందని తెలియజేశారు… అదే షాకింగ్ అంటే తర్వాత స్లో డౌన్ అవుతుంది అనుకున్న సినిమా అందరి కీ షాక్ ఇస్తూ…

ఇప్పటి వరకు ఏకంగా 150 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సొంతం చేసుకుందని అంటున్నారు. ఇందులో ఎంతవరకు యూనిక్ వ్యూస్ ఉన్నాయి అన్నది తెలియాల్సి ఉన్నా కానీ ఓవరాల్ గా ఈ రేంజ్ లో వ్యూస్ ని సొంతం చేసుకుంది అంటున్న ఈ సినిమా ఇప్పుడు ఇండియా లో పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తో….

చూసిన సినిమాల్లో హైయెస్ట్ వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది అంటున్నారు డిస్నీ ప్లస్ వాళ్ళు. దాంతో బయట టాక్ ఎలా ఉన్నా కానీ సినిమా కి వస్తున్న వ్యూస్ చూసి పెట్టిన 125 కోట్లకు ఫుల్ న్యాయం సినిమా చేస్తున్నందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ఫుల్ ఖుషీ లో ఉన్నారట ఇప్పుడు.

Leave a Comment