గాసిప్స్ న్యూస్

అక్కడ డిసాస్టర్ మూవీ అయినా…తెలుగు రీమేక్ కి రంగం సిద్ధం….ఏంటో ఇదీ!

కొన్ని కొన్ని సార్లు సినిమాల రిజల్ట్ కి అతీతంగా కొన్ని సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ లు సొంతం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ డిసాస్టర్ అయిన కొన్ని సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి, అలాగే ఇతర భాషల్లో ఫ్లాఫ్ అయిన సినిమాలను కూడా కొన్ని సార్లు టాలీవుడ్ లో రీమేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా హిందీ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఓ ఫ్లాఫ్ మూవీ ని…

ఇప్పుడు తెలుగు లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు, హిందీ లో ఈ ఇయర్ థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక రిలీజ్ అయిన మూవీస్ లో ఇమ్రాన్ హాష్మి మరియు జాన్ అబ్రహం ల కాంబినేషన్ లో రూపొందిన మల్టీ స్టారర్ మూవీ ముంబై సగ సినిమా…

సుమారు 2000 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ అయింది, 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత టాక్ జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉండటం, రొటీన్ మాస్ మసాలా మూవీ అవ్వడం తో టోటల్ రన్ లో ఎలాగోలా 20 కోట్ల రేంజ్ లో…

నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును ముగించింది, ఓవరాల్ గా రిజల్ట్ డిసాస్టర్ అవ్వగా ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చడం తో తెలుగు లో ఈ సినిమాను ఇద్దరు మీడియం రేంజ్ హీరోలతో రీమేక్ చేస్తే బాగుంటుంది అని రీమేక్ రైట్స్ ని 50 లక్షల రేటు చెల్లించి రైట్స్ ని సొంతం చేసుకున్నారు అని లేటెస్ట్ టాక్… హీరోలు గా ఎవరు నటిస్తారు…

అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కానీ అందులో ఒక రోల్ ని మెగా హీరోల్లో ఒకరు చేస్తున్నారు అంటున్నారు. వరుణ్ తేజ్ లేదా సాయి ధరం తేజ్ నటించే చాన్స్ ఉందని అంటున్నారు. మరో రోల్ కి వేరే హీరో ని తీసుకుని తెలుగు లో బాగా రీమేక్ చేయాలనీ భావిస్తున్నారట. అక్కడ డిసాస్టర్ అయిన ఈ సినిమా తెలుగు లో ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Leave a Comment