న్యూస్ స్పెషల్

అక్కడ విజయ్….ఇక్కడ ఎన్టీఆర్…చరిత్ర సృష్టించారు!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ఇలయ దళపతి విజయ్ లు మంచి మిత్రులు, సోషల్ మీడియా లో ఇద్దరికీ కూడా అల్టిమేట్ క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కోలివుడ్ పరంగా విజయ్ సినిమాల టీసర్లు, ట్రైలర్ లు సోషల్ మీడియా రికార్డులను కొట్టేవాల్లె లేరు, ఇక టాలీవుడ్ లో టాప్ స్టార్స్ ఎక్కువ కాబట్టి ఎప్పుడూ నువ్వా నేనా అన్న పోటి అన్ని సోషల్ మీడియా ట్రెండ్స్ లో టీసర్ అండ్ ట్రైలర్ వ్యూస్ లైక్స్ విషయం లో ఉంటుంది.

కానీ ప్రస్తుతానికి చరిత్ర సృష్టించింది మాత్రం అక్కడ విజయ్ మరియు ఇక్కడ ఎన్టీఆర్ అనే చెప్పాలి. సౌత్ మూవీస్ పరంగానే కాకుండా ఇండియా వైడ్ గా కూడా సినిమా టీసర్ ల విషయం లో మొట్ట మొదటి సారి 1 మిలియన్ లైక్స్ రికార్డ్ ను అందుకున్న హీరోగా….

ఇలయ దళపతి విజయ్ సంచలన రికార్డ్ ను 2017 లో మెర్సల్ సినిమా తో సొంతం చేసుకోగా మళ్ళీ తన రికార్డ్ ను తానె 2018 లో సర్కార్ సినిమా తో బ్రేక్ చేసి ఈ సారి కేవలం 24 గంటల్లోనే ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను సొంతం చేసుకోగా….

ఇప్పుడు టీసర్ల విషయం లో ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇంట్రో టీసర్ టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 1 మిలియన్స్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలవగా సౌత్ మూవీస్ పరంగా ఈ మార్క్ ని అందుకున్న మూడో టీసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. విజయ్ 2 సినిమాలతో టాప్ లో ఉండగా ఇప్పుడు ఎన్టీఆర్….

1 టీసర్ తో ఉన్నాడు, టోటల్ గా సౌత్ మొత్తం మీద కాకుండా ఇండియా లో కూడా 1 మిలియన్ లైక్స్ ఉన్న హీరోలలో ఇద్దరు సౌత్ హీరోలు నిలవడం విశేషం అని చెప్పాలి, దాంతో ఇక రానున్న టైం లో మిగిలిన హీరోల ఫ్యాన్స్ ఈ 1 మిలియన్ లైక్స్ పై స్పెషల్ దృష్టి పెట్ట బోతున్నారు అని చెప్పాలి.

Leave a Comment