గాసిప్స్ న్యూస్

అక్కడ షూట్ చేయలేరు…సెట్ కి టైం లేదు….ఎపిసోడ్ మొత్తాన్ని లేపేశారు!

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతున్న హాట్రిక్ మూవీ పై అంచనాలు పీక్స్ లో ఉండగా, మొదటి రెండు సినిమాల్లో పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పెట్టిన బోయపాటి ఈ సారి అంతకు మించిన పవర్ ఫుల్ సీన్స్ తో సెకెండ్ ఆఫ్ ని రాఫ్ఫాడించబోతున్నాడు. ఈ సినిమా సెకెండ్ ఆఫ్ లో బాలయ్య అఘోరా రోల్ లో కనిపించ బోతున్న విషయం తెలిసిందే.

కాగా ఈ రోల్ కి సంభందించిన కొంత భాగం షూటింగ్ ని కరోనా ఎంటర్ అవ్వక ముందే వారణాసి లో షూటింగ్ చేశారు. తర్వాత కరోనా ఎఫెక్ట్ తో అటు సైడ్ వెల్ల లేకపోయారు. ఇప్పుడు కూడా పరిస్థితులు ఏమాత్రం సెట్ కాలేదన్న విషయం అందరికీ తెలిసిందే.

దాంతో త్వరలోనే సినిమా షూటింగ్ తిరిగి జరపాలి అని భావిస్తున్న టీం ఇక్కడే ఆ సెట్ వేయాలి అని భావించినప్పటకీ దానికి కూడా మళ్ళీ బడ్జెట్ పెంచడం చాలా రోజులు సెట్ వేయడం తోనే సరిపోతుందని భావిస్తుండగా…ఇప్పుడు టీం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.

సినిమాను టీం సంక్రాంతి రేసులో నిలపాలని భావిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు వారణాసి వెళ్లి షూట్ చేయలేం అలాగే, ఇక్కడ అంత పెద్ద సెట్ వేస్తూ కూర్చోలేం కాబట్టి అఘోరా రోల్ బ్యాడ్రాప్ ని వారణాసి లో కాకుండా లోకల్ గానే చిత్రీకరించాలని యూనిట్ భావిస్తుందని సమాచారం. కొన్ని అత్యవసర సన్నివేశాలు సెట్ అవ్వకుంటే… సినిమా షూటింగ్ ఎండ్ టైం కి పరిస్థితులను బట్టి….

అక్కడికి కుదిరితే వెళదామని టీం భావిస్తుందట… మొత్తం మీద ఇప్పుడు అఘోరా రోల్ కన్ఫాం గా ఉన్నప్పటికీ ఆ రోల్ బ్యాడ్రాప్ ని వారణాసి గా కాకుండా లోకల్ గానే చిత్రీకరించబోతున్నారు అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాపై మరిన్ని విషయాలు తెలియనున్నాయి. బాలయ్య బోయపాటి మాత్రం సినిమా షూటింగ్ ఒక్కసారి మొదలు పెట్టక నాన్ స్టాప్ జరపాలని భావిస్తున్నట్లు సమాచారం…

Leave a Comment