గాసిప్స్ న్యూస్

అక్కడ సేన్సేసనల్ బ్లాక్ బస్టర్…ఇక్కడ ఫ్లాఫ్ హీరో రీమేక్!!

ఒక భాషలో హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం కామనే, బాలీవుడ్ మూవీస్ టాలీవుడ్ లో రేర్ గా రీమేక్ అవుతాయి కానీ టాలీవుడ్ మూవీస్ క్రమం తప్పకుండా బాలీవుడ్ లో రీమేక్ అవ్వడం కామన్. రీసెంట్ టైం లో అక్కడ మన రీమేక్ లు ఎక్కువ అయిన వేల ఇప్పుడు అక్కడ నుండి కూడా ఇక్కడ రీమేక్ ల వెల్లువ మొదలు అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం కొన్ని సినిమాలు రీమేక్ కి సిద్ధం అవుతుండగా…

వాటిలో కొంచం యూనిక్ అండ్ క్రేజీ మూవీ ఒకటి ఇక్కడ రీమేక్ కి సిద్ధం అవుతుంది, ఆ సినిమా నే అందాదూన్. బాలీవుడ్ యంగ్ అండ్ డబుల్ హాట్రిక్ హీరో ఆయుష్ మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ సక్సెస్ ను సొంతం చేసుకుంది.

సినిమా లో గుడ్డివాడిలా నటించిన అయిష్ మాన్ ఖురానా కి అల్టిమేట్ రెస్పాన్స్ కూడా దక్కింది, అలాంటి డిఫెరెంట్ మూవీ ని ఇప్పుడు టాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. స్వామిరారా ఫేమ్ సుదీర్ వర్మ డైరెక్షన్ లో నితిన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవ్వడానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం…

బాక్స్ ఆఫీస్ దగ్గర నితిన్ క్లీన్ హిట్ కొట్టి ఏళ్ళు గడుస్తుంది, అప్పట్లో వరుస ఫ్లాఫ్స్ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతైందే తో సక్సెస్ ట్రాక్ ఎక్కినా హార్ట్ అటాక్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క క్లీన్ హిట్ కూడా అందుకోలేక పోయాడు నితిన్. రీసెంట్ టైం లో వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న నితిన్…

తన ఆశలన్నీ భీష్మ మీదే పెట్టుకోగా ఆ సినిమా తర్వాత ఈ అందాదూన్ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు. సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. మరి వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న నితిన్ ఈ సినిమా తో బాలీవుడ్ లో దక్కినంత విజయాన్ని రిపీట్ చేయగలుగుతాడో లేదో చూడాలి.

Leave a Comment