గాసిప్స్ న్యూస్

అక్కడ 111 కోట్ల బ్లాక్ బస్టర్… ఇక్కడ హీరో-హీరోయిన్స్ పేర్లు వినే…డిసాస్టర్ అని ఫిక్స్ అయ్యారు!

ఒక భాషలో ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడం కామన్, కానీ కొన్ని సినిమాలు అప్పడప్పుడు ఫ్లాఫ్ స్టార్స్ కానీ ఫేడ్ అవుట్ అయిన స్టార్స్ కానీ రీమేక్ చేస్తూ ఉంటారు, కొందరు ఇలా సడెన్ కంబ్యాక్ ఇవ్వొచ్చు అన్న నమ్మకంతో ఉంటారు కానీ చాలా రేర్ గానే ఇలా జరుగుతూ వస్తుంది, ఇప్పుడు అదే నమ్మకంతో ఓ బ్లాక్ బస్టర్ మూవీ ని రీమేక్ చేస్తున్నాడు…

ఫేడ్ అవుట్ అయిన స్టార్… ముందుగా ఆ సినిమా వివరాలను గమనిస్తే… బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆయుష్ మాన్ ఖురానా నటించిన మూవీ అంధ దూన్, డిఫెరెంట్ కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచి ఏకంగా….

111 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, ఈ సినిమాను తెలుగు లో యూత్ స్టార్ నితిన్ రీమేక్ చేస్తుండగా నభా నటేష్ హీరోయిన్ గా నెగటివ్ రోల్ లో తమన్నా నటిస్తుంది. తెలుగు లో మంచి క్రేజీ కాంబినేషన్ గా రూపొందుతున్న ఈ రీమేక్ తమిళ్ లో కూడా అనౌన్స్ చేశారు.

కానీ తమిళ్ లో స్టార్ కాస్ట్ చూసి సినిమా పోయే సినిమానే అని ఇప్పటి నుండే డిసైడ్ అయ్యారు. జీన్స్ లాంటి సినిమాతో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన హీరో ప్రశాంత్ అందరికీ గుర్తే ఉండి ఉంటాడు, తెలుగు లో రామ్ చరణ్ వినయ విదేయ రామ లో అన్న రోల్ లో చేసిన ఈ ఫేడ్ అవుట్ హీరో ఈ రీమేక్ లో నటిస్తుండగా…

హీరోయిన్ గా ప్రియా ఆనంద్ నటిస్తుంది, ఇక నెగటివ్ రోల్ లో సిమ్రాన్ నటిస్తుండగా కంప్లీట్ గా హీరో హీరోయిన్స్ పేర్లు చూసి తబు రోల్ లో అక్కడ సిమ్రాన్ ని సెలెక్ట్ చేయడం చూసి ఈ సినిమా ఏదైనా అద్బుతం జరిగితే తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయ్యే మూవీనే అని అక్కడ డిసైడ్ అయ్యారు. టీం మాత్రం ఆ అద్బుతం జరుగుతుంది అని ఎదురు చూస్తున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

Leave a Comment